నల్ల ద్రాక్షలైన ఆకుపచ్చ ద్రాక్షలైనా సరే చాలా పోషకాలు కలిగి ఉన్న పండ్లు. ద్రాక్షలో దాగున్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం. ద్రాక్షపండ్లలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఫ్లెవనాయిడ్స్, రెస్విరేటాల్, క్వెర్సెటిన్ వంటి పోషకాలుంటాయి. ఈ పోషకాలు ఫ్రీరాడికల్స్ ను సంతులనపరచి ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. ద్రాక్షలో పాలీఫెనాల్స్, రెస్వోరెటాల్ ఉంటాయి. ఇవి కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యానికి చాలా అవసరం. బీపీ తగ్గించి, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. ఇది నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ద్రాక్షలో ఉండే రిస్వెరెట్రాల్ వల్ల యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి. రిస్వెరెట్రాల్ వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. ద్రాక్షలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels