సూపర్ ఫూడ్స్​లో అంజీర్​కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు కలిగి ఉన్న ఈ ఫ్రూట్ పురుషుల హెల్త్​కి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

పోషకాలన్నింటితో పాటు అంజీరాలలో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సహజంగా టెస్టోస్టిరాన్ సంశ్లేషణకు తోడ్పడుతుంది.

వీర్య నాణ్యత పెరుగుతుంది. అంజీరాల్లోని విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాల వల్ల శుక్రకణాల కదలికలు చురుగ్గా ఉంటాయి.

ప్రతి రోజూ ఆహారంలో డ్రై అంజీరా చేర్చుకుంటే మలబద్దకం క్రమంగా తగ్గిపోతుంది.

తక్కువ క్యాలరీలు కలిగిన డ్రైఫ్రూట్ అంజీరా. క్యాలరీ కౌంట్ గురించి ఆలోచించకుండా తినొచ్చు.

అంజీరాలు మలబద్దకాన్ని తగ్గించడం వల్ల పరోక్షంగా ప్రొస్టేట్ గ్రంథిలో ఇన్ఫ్లమేషన్​ను నివారిస్తాయి

కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ వల్ల ఎముకల బలంగా ఉంటాయి.

ఇవి రక్తనాళాల ఆరోగ్యానికి మంచిది. ఫలితంగా గుండె పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.



డైటరీ ఫైబర్ వల్ల షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels