News
News
X

Ram Charan – Upasana: మీకు తెలుసా? చెర్రీ, ఉపాసన ఎక్కడకెళ్లినా చిన్న సైజు ఆలయాన్ని వెంట తీసుకెళ్తారట!

రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ‘నాటు నాటు’ పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసిన చెర్రీ, ఆస్కార్ రాకతో మరింత పాపులర్ అయ్యారు. తాజాగా తన భార్య గురించి ఆయన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు.

FOLLOW US: 
Share:

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన్ని అంతా గ్లోబర్ స్టార్ అని పిలుస్తున్నారు. ‘RRR’ సినిమాతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చెర్రీ కలిసి చేసిన ‘‘నాటు డ్యాన్స్’’కు ప్రపంచం ఫిదా అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు దాసోహం అన్నది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డులను దక్కించుకుంది. తాజాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అత్యున్న ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

ఎక్కడికి వెళ్లినా సీతారాముల విగ్రహాలు ఉండాల్సిందే!

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగి ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుకలో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి పాల్గొన్నారు. నిజానికి చెర్రీ చాలా వరకు విదేశీ పర్యటనలు భార్యతో కలిసే చేస్తారు. అయితే, తాము ఎక్కడికి వెళ్లాలన్నా  తప్పకుండా ఓ పని చేస్తామని చెప్పారు రామ్ చరణ్. ఫారిన్ ట్రిప్పులకైనా, ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడైనా కచ్చితంగా దేవుడికి పూజలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాతే బయటకు అడుగు పెడతామన్నారు. ఉపాసన ఎక్కడికి వెళ్లినా తనతో పాటు చిన్న సీతారాముల విగ్రహాలను తీసుకువెళ్తుందట.

ఆస్కార్ వేడుకలకు ముందు చెర్రీ దంపతుల పూజలు

తాజా ఆస్కార్ వేడుకలలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలోనూ ఉపాసన ఈ విగ్రహాలను తీసుకెళ్లారట. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్లే ముందుకు తమ హోటల్ గదిలో సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు చేశారట.  “ఎక్కడికి వెళ్లినా నా భార్య  తప్పకుండా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అది మాకు చాలా కాలంగా అలవాటు అయ్యింది. ఈ ఆలయం మన ఆచారాలనే కాదు, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది” అని తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్కార్ కు ముందు రామ్ చరణ్, ఉపాసన పూజలు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  

ఆస్కార్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా చెర్రీ దంపతులు

ఇక ఆస్కార్ వేడుకలో చెర్రీ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటలీకి చెందిన కస్టమ్ మేడ్ షూస్‌తో పాటు భారతీయ డిజైనర్లు శంతను, నిఖిల్ తన కోసం రూపొందించిన పూర్తిగా నలుపు రంగు భారతీయ దుస్తులను చెర్రీ ధరించాడు. "నేను ఈ దుస్తులను ధరిస్తే భారతదేశాన్ని ధరించినట్లు అనిపిస్తుంది” అని చెర్రీ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ఇక  ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన, ఎర్రటి పువ్వుతో కూడిన నెక్లెస్‌ ను ధరించింది. క్రీమ్ చీరను కట్టుకుంది. ఆమె చీరను తెలంగాణ కళాకారులు పట్టు స్క్రాప్‌లతో తయారు చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 

Read Also: ‘నాటు నాటు’ స్టెప్పులు వెయ్యాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ మలయాళ పత్రిక చూస్తే సరిపోతుంది!

Published at : 15 Mar 2023 11:32 AM (IST) Tags: Upasana Ram Charan Small temple

సంబంధిత కథనాలు

Shastipoorthi Movie : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!

Shastipoorthi Movie : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

టాప్ స్టోరీస్

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...