Sankranthiki Vasthunam: ఫైనల్లీ.. వెంకీ అందుకే ఈ సాంగ్ సింగాడన్నమాట.. ఏయ్ సంక్రాంతి..!
Sankranthiki Vasthunam Song: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద’, ‘మీనూ’ సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, ఇప్పుడొచ్చిన ఫెస్టివల్ సాంగ్ ఎలా ఉందంటే..

Blockbuster Pongal Song: విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లతో కలిసి వెంకటేష్ చూపిస్తున్న జోరు చూస్తుంటే.. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ బొమ్మ రెడీ అవుతుందనే ఫీల్‌ని అందరికీ ఇస్తోంది.. అందరిలో వచ్చేస్తోంది. అలాగే మ్యూజిక్ ప్రమోషన్స్‌లో ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా.. సోమవారం చిత్రయూనిట్ మరో పాటని విడుదల చేసింది.
ఈ పాట విశేషం ఏమిటో ముందుగానే ప్రొమోలతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ‘సంక్రాంతి ఫెస్టివల్’ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ పాటని ‘నేను పాడతా’ అంటూ దర్శకుడిని హీరో వెంకీ విసిగించిన వీడియో ఒకటి వదిలి.. పాటపై భారీగా అంచనాలను పెంచేశారు. అందులోనూ ‘గోదారి గట్టు మీద’ సాంగ్ అతి తక్కువ టైమ్‌లో 50 మిలియన్ల వ్యూస్ రాబట్టుకోవడం, రీసెంట్‌గా వచ్చిన ‘మీనూ’ సాంగ్ వినగానే నచ్చేయడంతో.. మూడో పాటపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా.. చిన్న చిన్న ప్రోమోలతో, ప్రమోషన్స్‌తో.. పాట విడుదలకాకుండానే జనాల్లోకి ఎక్కించేసింది వెంకీ అండ్ టీమ్. న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన ఈ ‘సంక్రాంతి’ సాంగ్ వింటుంటే.. ఓమో అందుకేనా వెంకీ ‘నేను పాడతా.. నేను పాడతా’ అంటూ అనిల్ రావిపూడి చుట్టూ తిరిగింది అని అనుకుండా ఉండలేరు. ఎందుకంటే వెంకీ వాయిస్‌లో ఈ పాట అలా ఉంది మరి.
ఇక ఈ ‘సంక్రాంతి ఫెస్టివల్’ సాంగ్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఒక సరికొత్త ట్యూన్‌తో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని అదిరిపోయేలా క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటు.. భీమ్స్ DJ అవతార్‌లో ఇచ్చిన ఆలాపన అదుర్స్ అనేలా ఉంది. సంక్రాంతి స్పెషల్‌ను తెలుపుతూ భీమ్స్ పాటని ఓపెన్ చేస్తే.. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మాస్ స్టెప్స్‌లో పాటలో ఊపు తెచ్చారు. ఈ పాటలో వారి ఎనర్జీ వావ్ అనేలా ఉంది. మొత్తంగా అయితే.. మూడో పాట కూడా సినిమాపై బ్లాక్‌బస్టర్ వైబ్‌ని తీసుకొచ్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా వేసిన సెట్, కలర్ కోడింగ్.. ఒక్కటేమిటి, పొంగల్ అని వినిపిస్తే చాలు.. ఈ పాట ఏసుకునేలా.. టీమ్ అంతా పొంగల్ ట్రీట్ ఇచ్చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ సినిమాలతో ఇది పోటీ పడనుంది.
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

