Naga Chaitanya: విరూపాక్ష దర్శకుడితో నాగ చైతన్య సినిమా... అఫీషియల్‌గా NC 24ను అనౌన్స్ చేశారోచ్
Naga Chaitanya New Movie: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొత్త సినిమా అనౌన్స్ చేశారు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో ఈ సినిమా చేయనున్నారు.
NC 24 Announcement News: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా ప్రకటన ఈ రోజు వచ్చింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా NC 24 సినిమాను అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
విరూపాక్ష దర్శకుడితో చైతూ సినిమా
Naga Chaitanya teams up with Karthik Dandu: హారర్ థ్రిల్లర్ 'విరూపాక్ష'తో భారీ విజయం అందుకున్న యువ దర్శకుడు కార్తీక్ దండు. సాయి దుర్గా తేజ్, సంయుక్త జంటగా నటించిన ఆ సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఆ విజయం తర్వాత అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశాన్ని కార్తీక్ అందుకున్నారు. చైతన్యకు ఇది 24వ సినిమా.
'విరూపాక్ష' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇంకెప్పుడు లేనంత లోతుకు అతను వెళ్తాడు అని ఒక క్యాప్షన్ కూడా రిలీజ్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే... ఇదొక మిస్టిక్ థ్రిల్లర్ అని అర్థం చేసుకోవచ్చు.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే షోస్ క్యాన్సిల్, కలెక్షన్స్ అయితే మరీ ఘోరం
He'll delve into depths darker than ever 🌑#NC24 - An excavation into Mythical Thrills & shivers. 💥
— SVCC (@SVCCofficial) November 23, 2024
Happy Birthday Yuva Samrat @chay_akkineni 🌟
Directed by @karthikdandu86 🎬
Produced by @SVCCofficial & @SukumarWritings@BvsnP @AJANEESHB @Shamdatdop @NavinNooli pic.twitter.com/87Pt1kLCFJ
హారర్ థ్రిల్లర్ చైతూ చూడరు కానీ...
తనకు హారర్ సినిమాలు చూడడం అంటే భయం అని అక్కినేని నాగ చైతన్య గతంలో తెలిపారు. తాను హారర్ సినిమాలు చేసే అవకాశం లేదు అన్నట్లు కూడా రెండు మూడు సందర్భాలలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అక్కినేని కుటుంబానికి 'మనం' వంటి మధురమైన విజయం అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'దూత' వెబ్ సిరీస్ చేశారు. అది థ్రిల్లర్ సిరీస్. ఇప్పుడు విరూపాక్ష దర్శకుడితో హారర్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది, తండేల్ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక చైతూ ఈ సినిమా పనులు మొదలు పెడతారని తెలుస్తోంది.
'తండేల్' కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయిటింగ్!
ఇప్పుడు అక్కినేని నాగచైతన్య అభిమానులు సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. తొలుత క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేస్తూ డిసెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తరువాత సంక్రాంతిని కూడా ఒక ఆప్షన్ అనుకున్నారు. కానీ చివరకు ఆ సినిమా ఫిబ్రవరి కి వెళ్ళింది. ప్రేమికుల దినోత్సవం వానికి ఒక్క వారం ముందు ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన బుజ్జి తల్లి పాటకు మంచి స్పందన లభిస్తుంది.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?