Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Amaravati Line: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర తెలిపారు. ఇది గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ సహా పలు ప్రాంతాలను కలుపుతుందన్నారు.

Vijayawada DRM Comments On Amaravati Railway Line: ఎర్రుపాలెం - నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామని విజయవాడ (Vijayawada) డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు. రూ.2,545 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబరులో కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ కొత్త లైన్ అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలను కలుపుతుందని చెప్పారు.
'86 శాతం పంక్చువాలిటీతో రైళ్లు నడిపాం'
విజయవాడ - విశాఖ (Visakha) డివిజన్ మధ్య 128 కిలోమీటర్ల ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తి చేశామని.. దీని వల్లే సంక్రాంతి పండుగ సీజన్‌లో విజయవాడ డివిజన్ 86 శాతం పంక్చువాలిటీతో రైళ్లు నడిపినట్లు డీఆర్ఎం తెలిపారు. ఈ ఏడాది జనవరి నాటికి విజయవాడ డివిజన్ రూ.4,865 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని.. ఇది గతేడాది కంటే 3.62 శాతం ఎక్కువని చెప్పారు. 'ఈ ఏడాది విజయవాడ డివిజన్ నుంచి రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలన్నదే లక్ష్యం. విజయవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయాన్ని పొందే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం రూ.271 కోట్లు విడుదల చేశాం.' అని పేర్కొన్నారు.
అటు, ఏపీలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువని చెప్పారు. 'ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,560 కి.మీల రైల్వే ట్రాక్స్ వేశాం. 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్తుస్తున్నాం. ఈ స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాం. రాష్ట్రానికి మరిన్ని నమో భారత్, వందే భారత్ రైళ్లు కేటాయించాం. రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆధునిక సాంకేతికత సాయంతో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. అన్ని రైళ్లు 110 కి.మీ వేగంతో వెళ్లేలా ట్రాక్స్ సిద్ధం చేస్తున్నాం.' అని స్పష్టం చేశారు.
Also Read: AP News: ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

