By: ABP Desam | Updated at : 21 Mar 2023 10:25 AM (IST)
నటుడు కోట శ్రీనివాస రావు
నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) క్షేమంగా ఉన్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కోట శ్రీనివాసరావు మృతి చెందారని కొంత మంది పోస్టులు కూడా చేశారు. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా జర్నలిస్టులతో ఆయన ఫోనులు కూడా మాట్లాడారు.
కోట ఇంటికి పోలీసులు
తన ఆరోగ్యంపై వస్తున్న వందతులు నమ్మవద్దని కోట శ్రీనివాసరావు స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా ప్రచారం ఎంత పని చేసిందంటే... ఆ వార్త నిజమని నమ్మిన పోలీసులు కూడా ఆయన ఇంటికి వెళ్లారు. నలుగురూ వస్తే బందోబస్తు అవసరం అవుతుందని!
వీడియో విడుదల చేసిన కోట శ్రీనివాస రావు ''తెల్లవారితే ఉగాది. పండగ రోజున ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎవరో సోషల్ మీడియాలో 'కోట దుర్మరణం' అని వేశారట. దాంతో ఉదయం నుంచి ఒక్కటే ఫోనులు. ఇప్పటికి నేను కనీసం 50 ఫోనులు మాట్లాడాను. మా కుర్రాడు కొన్ని ఫోనులు మాట్లాడాడు. వ్యాను వేసుకుని పది మంది పోలీసులు వచ్చారు. పెద్దాయన మరణిస్తే ప్రముఖులు వస్తే సెక్యూరిటీ కావాలని వచ్చామని చెప్పారు. ఇటువంటి వార్తలు నమ్మవద్దని మనవి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడానికి జీవితంలో చండాలపు పనులు బోలెడు ఉన్నాయని, మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని, ఇటువంటి పనులు అక్కర్లేదని ఆయన సీరియస్ అయ్యారు.
కోట మృతి వెనుక రాజకీయ అభిమానులు!?
కోట శ్రీనివాసరావు మరణ వార్త ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో మొదలైంది. ఫార్వర్డ్ చేసిన సందేశాలను చూసిన కొంత మంది నిజమని నమ్మేశారు. సోషల్ మీడియా పోస్టులు చేశారు. అయితే, ఈ ప్రచారం వెనుక రాజకీయ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ళ క్రితం ఓ చిత్రసీమతో బలమైన సత్సంబంధాలు ఉన్న చెందిన రాజకీయ నాయకుడిపై ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు కామెంట్స్ చేశారు. అది నచ్చని కొందరు ఈ పుకారు పుట్టించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
'కబ్జా'లో అతిథిగా కోట శ్రీనివాస రావు
ఇప్పుడు కోట శ్రీనివాస రావు వయసు 75 ఏళ్ళు. మునుపటిలా ఆయన ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అలాగని, నటనకు విరామం ఇవ్వలేదు. వీలు చేసుకుని మరీ కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఉపేంద్ర, సుదీప్ హీరోలుగా గత శుక్రవారం విడుదలైన పాన్ ఇండియా సినిమా 'కబ్జా'లో కోట శ్రీనివాస రావు నటించారు. ఆయనది అతిథి పాత్ర తరహాలో ఉందని ప్రేక్షకులు చెప్పారు.
ఐదు భాషల్లో నటించిన కోట
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా కోట శ్రీనివాస రావు నటించారు. ఐదు భాషల్లో సినిమాలు చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ మాటకు వస్తే దక్కని (హైదరాబాదీ) భాషలో రూపొందిన 'హైదరాబాద్ నవాబ్స్' సినిమాలో కూడా నటించారు. సుమారు 750 సినిమాల్లో ఆయన నటించారు.
Also Read : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు
Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి