News
News
X

Ugram Teaser : పోలీసుగా అల్లరి నరేష్ ఉగ్రరూపం - పవర్ ఫుల్ 'ఉగ్రం' టీజర్ వచ్చేసిందోచ్

'నాంది' తర్వాత హీరో 'అల్లరి' నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా 'ఉగ్రం'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. 

FOLLOW US: 
Share:

నటుడిగా, కథానాయకుడిగా 'అల్లరి' నరేష్ ప్రయాణంలో 'నాంది' ఓ మైలు రాయి అని చెప్పాలి. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు విజయం అందించిన సినిమా. అంతే కాదు... నటుడిగా నరేష్ ప్రతిభను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా. ఆ చిత్రంతోనే విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు కొత్త సినిమాతో ఈ హీరో, దర్శకుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. 

'నాంది' తర్వాత హీరో 'అల్లరి' నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా 'ఉగ్రం'. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా నిర్మిస్తున్నది కూడా వీళ్ళే. హీరోగా నరేష్ 60వ చిత్రమిది. ఈ రోజు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)  టీజర్ విడుదల చేశారు. 

'ఉగ్రం' టీజర్ చూస్తే... స్టార్టింగులో నరేష్ పోలీస్ అనేది రివీల్ చేశారు. అడవిలో రౌడీలను చిత్తకొడుతూ కనిపించారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... మనిషిని పైకి ఎత్తు కింద పడేసే షాట్ బావుంది. నరేష్ సీరియస్ ఎక్స్ప్రెషన్ కూడా సూపర్. 'ఒంటి మీద యూనిఫామ్ ఉందనే కదా ఈ పొగరు. ఈ రోజు నీదే. నాకు ఓ రోజు వస్తుంది' అని విలన్ ఆవేశపడితే... 'నాది కాని రోజు కూడా నేను ఇలాగే నిలబడతా. అర్థమైందా!' అంటూ నరేష్ వెరీ కూల్ కౌంటర్ ఇచ్చారు.
 
'ఉగ్రం' కథ ఏంటి? అనేది కూడా టీజర్ ద్వారా దర్శక, నిర్మాతలు హింట్ ఇచ్చారు. పెళ్ళైన పోలీస్ అధికారిగా సినిమాలో నరేష్ కనిపించనున్నారు. ఆయనకు ఓ పాప కూడా ఉందని చూపించారు. ఫ్యామిలీని టచ్ చేయడంతో ఉగ్ర రూపుడైన హీరో ఏం చేశారు? అనేది కథగా తెలుస్తోంది. ఫ్యామిలీ లాస్ తర్వాత కనిపించే సన్నివేశాల కోసం నరేష్ లుక్ కూడా చేంజ్ చేశారు. అయితే, టీజర్‌లో నరేష్ చేత 'ల...క' డైలాగ్ చెప్పించారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం బావుంది. వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  

Also Read టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ఇప్పుడు రామ్ చరణ్ - హాలీవుడ్‌లో క్రేజ్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే 

'నాంది'లో చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించే నరేష్ అండర్ ట్రయిల్ ఖైదీగా నరేష్ కనిపిస్తే... 'ఉగ్రం'లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. నటుడిగా ఉగ్రరూపం చూపించారు. 

ఈ సినిమాలో 'అల్లరి' నరేష్ భార్యగా, కథానాయిక మిర్నా నటించారు. ఈ చిత్రానికి కథ తూము వెంకట్ అందించగా... 'అబ్బూరి' రవి మాటలు రాశారు. ఇంకా ఈ చిత్రానికి ఎడిటర్ : చోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి, సంగీతం : శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్, నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకత్వం : విజయ్ కనకమేడల. 

Also Read ఇంటికి పంపాలనుకున్నా వెళ్ళను, పవర్ స్టార్ స్థాయికి ఎదుగుతా, మీకెందుకు తొందర? - కిరణ్ అబ్బవరం  

Published at : 22 Feb 2023 11:45 AM (IST) Tags: allari naresh Director Vijay Kanakamedala Nandi Combo Is Back Ugram Teaser Ugram Teaser Review

సంబంధిత కథనాలు

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !