అన్వేషించండి

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)' పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)' పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం (సెప్టెంబరు 25న) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రూల్ నంబర్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఆగస్టు 20న ఈ పరీక్షను దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించగా దాదాపు 29 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 

మొత్తం రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్-1 పరీక్షకు 15,01,719 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. పేపర్- 2 పరీక్షకు 14,02,184 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 80 శాతానికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. సెప్టెంబర్ 16న ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరించారు. తాజాగా సీటెట్ ఫలితాలను విడుదల చేశారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

సీటెట్ (జులై) - 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్-జులై) - 2023' నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏప్రిల్ 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.

సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం..

పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

సీటెట్ జులై 2023 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget