అన్వేషించండి

CBSE CTET 2023: సీటెట్‌ (జులై) - 2023 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మే 26 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై - ఆగస్టు మధ్య సీటెట్ పరీక్ష నిర్వహించనున్నారు....

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2023 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏప్రిల్ 25న విడుదల చేసింది. సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మే 26 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జులై, డిసెంబరు) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. 

వివరాలు..

✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబరు -2022

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు...

➥ సీటెట్ జులై 2023 నోటిఫికేషన్ వెల్లడి: 25.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.05.2023.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 26.05.2023.

➥ పరీక్ష తేదీ: జులై - ఆగస్టు మధ్య.

Notification

Online Application

Website

Also Read:

రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల, అడ్మిట్‌కార్డులు అందుబాటులో!
సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు.
అడ్మిట్ కార్డులు, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
IPL 2024: మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్! ట్రావిస్ హెడ్‌ ఏమిటీ ఊచకోత!
కాటేరమ్మ కొడుకు ట్రావిస్ హెడ్‌! ఏమిటీ ఊచకోత - మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్!
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD' అప్డేట్ - రేపు రెడీగా ఉండండి అంటూ!
‘కల్కి 2898 AD' అప్డేట్ - రేపు రెడీగా ఉండండి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Madhavi Latha vs Asaduddin Owaisi | బీఫ్ జిందాబాద్ అన్న ఓవైసీ... కౌంటర్ వేసిన మాధవిలత | ABP DesamIVF Cows at Tirumala | TTD | ఆవుల్లో అద్దె గర్భాలు.. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి | ABPBJP Madhavi Latha | ప్రచారంలో మాధవిలతకు ఝలక్.. వైరల్ వీడియో | ABP DesamGems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
IPL 2024: మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్! ట్రావిస్ హెడ్‌ ఏమిటీ ఊచకోత!
కాటేరమ్మ కొడుకు ట్రావిస్ హెడ్‌! ఏమిటీ ఊచకోత - మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్!
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD' అప్డేట్ - రేపు రెడీగా ఉండండి అంటూ!
‘కల్కి 2898 AD' అప్డేట్ - రేపు రెడీగా ఉండండి అంటూ!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
Embed widget