Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!
దేశంలో ఇకపై నకిలీ సర్టిఫికేట్ల దందాకు చెక్ పడనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
దేశంలో ఇకపై నకిలీ సర్టిఫికేట్ల దందాకు చెక్ పడనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై విద్యార్థుల సర్టిఫికేట్లను 'డిజీ లాకర్'లో నిక్షిప్తం చేయాలంటూ యూజీసీ ద్వారా అన్ని వర్సిటీలను ఆదేశించింది. డిజీ లాకర్ల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర మానవ వనరుల శాఖకు అప్పగించింది. విదేశాల్లో ఉన్నత విద్య ప్రవేశాలు మొదలవడం, దేశం నుంచి విద్యార్థులు అమెరికా, ఐరోపా, అస్ట్రేలియాలకు వెళ్తుండటంతో కేంద్ర మానవవనరుల శాఖ అప్రమత్తమైంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, యూజీసీ అధికారులు దక్షిణాది రాష్ట్రాల్లోని వర్సిటీల అధికారులతో ఆన్‌లైన్ ద్వారా కొద్దిరోజుల కిందట సమావేశం నిర్వహించారు. పదేళ్ల క్రితం నాటి విద్యార్థుల పత్రాలన్నీ తొలుత డిజిటలీకరణ చేయాలని, తర్వాత 20 ఏళ్లు, 30 ఏళ్ల రికార్డులను డిజిటలీకరణ చేయాలని సూచించారు.
'హోలోగ్రామ్' సహా తయారీ..
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదవాలని, అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడాలన్న లక్ష్యంతో కొందరు విద్యార్థులు రూ.లక్షలు చెల్లించి నకిలీ ఇంజినీరింగ్, డిగ్రీ సర్టిఫికెట్లు కొంటున్నారు. వీటిని తయారుచేస్తున్న అక్రమార్కులు వర్సిటీల 'హోలోగ్రామ్' సైతం సృష్టిస్తున్నారు. ప్రతి విద్యార్థి ధ్రువపత్రాలు సరైనవా? కావా? అని పరిశీలించేందుకు సమయం లేక విదేశీ వర్సిటీలు అక్కడి ఏజెన్సీలకు పరిశీలన బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఆ ఏజెన్సీలు మన వర్సిటీలను సంప్రదించినప్పుడు హాలోగ్రామ్ పంపగా కొన్ని వర్సిటీల అధికారులు నకిలీవంటుంటే.. మరికొందరు ఆ హాలోగ్రామ్ తమవేనంటున్నారు. రెండేళ్లలో హైదరాబాద్ నుంచే సుమారు వెయ్యిమంది విద్యార్థులు వెళ్లగా 300 మంది అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు సాంకేతిక ఇబ్బందులుండటంతో వారు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వీసాను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించారు.
విద్యార్థులు సర్టిఫికేట్లను డిజిటలీకరణ ద్వారా భద్రపరచడమే డిజీ లాకర్. ఇలా భద్రపరచిన సమాచారా సురక్షితంగా ఉంటుంది. డిజీ లాకర్‌లో విద్యార్థి పేరు, విద్యార్హత పత్రం నమోదు చేయగానే నకిలీవి అయితే ఫైల్ నాట్ ఫౌండ్ అని చూపుతుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్హత పత్రాల్లో మార్కులను దిద్దుకున్నా లేదా ట్యాంపరింగ్ చేసినా, నాలుగేళ్లలో పాస్ కాకపోతే పాస్ అయినట్టు నకిలీ పత్రాలు సృష్టించినా డిజీ లాకర్‌లో వివరాల ఆధారంగా నిజం నిరూపించవచ్చు. ఎవరైనా సర్టిఫికేట్లు పోగొట్టుకున్నా వర్సిటీని సంప్రదించి అఫిడవిట్ సమర్పిస్తే డిజిటల్ విద్యార్హత పత్రాలను వెంటనే జారీ చేస్తారు.
Also Read:
ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్, నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
ఎంబీబీఎస్ అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నీట్ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..