By: ABP Desam | Updated at : 07 Feb 2023 10:06 AM (IST)
Edited By: omeprakash
మ్యాట్ ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
వివరాలు...
* మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్ ) ఫిబ్రవరి 2023 సెషన్
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్నెట్/పేపర్/కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1900. రెండు విధానాల్లో పరీక్షలు రాసేవారు రూ.3050చెల్లించాలి.
పరీక్ష విధానం:
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
సిలబస్..
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: ఇందులో అభ్యర్థి ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం, గ్రామర్ పరిజ్ఞానం తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పేరా జంబుల్, రీడింగ్ కాంప్రహెన్షన్, అనలిటికల్ ఎబిలిటీ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్: ఇందులో క్రిటికల్ రీజనింగ్‌పై అభ్యర్థుల ప్రతిభను తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా ప్యాసేజ్-కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్-ఆర్గ్యుమెంట్, అనాలజీ బేస్డ్ ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, కోడింగ్ అండ్ డీ కోడింగ్, ఫ్యామిలీ ట్రీ, ఎఫెక్ట్ అండ్ కాజ్, సీక్వెన్సింగ్ గుర్తించడం వంటి ప్రశ్నలు అడుగుతారు.
మ్యాథమెటికల్ స్కిల్స్: ఈ విభాగంలో పదో తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా జామెట్రీ, నంబర్ సిస్టమ్, ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్, ప్రోగ్రెషిన్, ఆల్జీబ్రా, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశముంది.
డేటా అనాలసిస్ అండ్ సఫిషియన్సీ: ఈ విభాగంలో గ్రాఫ్స్(ఏరియా అండ్ లైన్), డేటా విశ్లేషణ(సఫిషియన్సీ), వెన్ రేఖాచిత్రాలు, పై చార్‌ట్స, పజిల్స్, టేబుల్స్ వంటి అంశాల్లో అభ్యర్థుల ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురవుతాయి.
ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్: ఈ విభాగం ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు, చరిత్ర, పాలిటిక్స్, సైన్స్, అవార్డులు, కరెంట్ అఫైర్స్, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌పై అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
Also Read: బిట్‌శాట్- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
ఏపీ ప్రెస్ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు