అన్వేషించండి

BITSAT Notification 2023: బిట్‌శాట్‌- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు.

రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు.

బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2  పరీక్షలు నిర్వహించనున్నారు.

వివరాలు...

⫸ బిట్‌శాట్ - 2023 ప్రవేశ ప్రకటన

➜ క్యాంపస్‌లవారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం:

I. బిట్స్‌పిలానీ- పిలానీ క్యాంపస్:

బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్.

బీఫార్మసీ

ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.

II. బిట్స్ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:

బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.

ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

III. బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్,

మెకానికల్.

➥ బీఫార్మసీ

➥ ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: బిట్‌శాట్-2023 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

పరీక్ష విధానం: బిట్‌శాట్‌-2023 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు ఫీజు: సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు).

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.04.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 16 - 20.04.2023.

బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1: 21- 26.05.2023.

బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-2: 18 -22.06.2023

Notification
Online Application
Website

Also Read:

తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!

తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget