News
News
X

TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.

వివరాలు..

* సైనిక పాఠశాల - ఇంటర్(ఎంపీసీ) ప్రవేశాలు

సీట్ల సంఖ్య: 80 

సీట్ల కేటాయింపు: ఎస్సీ- 60, బీసీ (సి)- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01 సీట్లు కేటాయించారు.

అర్హతలు: 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన లేదా ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్న బాలురు దరఖాస్తుకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000కు మించకూడదు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.04.2023 నాటికి 16 ఏళ్లు మించకూడదు. 01.04.2007 నుంచి 31.03.2009 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో 100 మార్కులకు రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష, రెండో దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాతి దశలో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ (డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టు, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.02.2023.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 17.02.2023.

➥ ప్రవేశ పరీక్ష తేదీ: 26.02.2023.

➥ రాత పరీక్ష ఫలితాల విడుదల: 08.03.2023.

➥ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు:10, 12, 14, 18, 19.03.2023.

➥ తుది ఫలితాల ప్రకటన: 28.03.2023.

➥ పాఠశాలలో ప్రవేశాల ప్రారంభం: 30.03.2023.

Notification

Online Application

Website

                                         

Also Read:

తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!

తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 02 Feb 2023 07:37 PM (IST) Tags: TSWRES Inter Admissions TSWRES Sainik School notification inter first year admissions

సంబంధిత కథనాలు

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం