News
News
X

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 'తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

వివరాలు..

* తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

సీట్ల సంఖ్య: 1140 (ఎంపీసీ-575 సీట్లు, బైపీసీ-565 సీట్లు).

సీట్ల కేటాయింపు: బాలురు-660; బాలికలు-480.

అర్హత: ఈ ఏడాది మార్చిలో పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే పదోతరగతి ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 మించకూడదు. ఇంగ్లిష్/తెలుగు మాధ్యమం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: విద్యార్థుల వయస్సు 31.08.2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ మెరిట్, దరఖాస్తులో విద్యార్థి ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు OMR విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపీసీ- ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(60 మార్కులు), ఫిజిక్స్(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో, బైపీసీ- ఇంగ్లిష్(20 మార్కులు), మ్యాథ్స్(20 మార్కులు), ఫిజిక్స్(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు), బయాలజీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.02.2023.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 27.02.2023.

➥ స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 12.03.2023.

Notification

Online Application

Also Read:

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!

తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 02 Feb 2023 08:45 AM (IST) Tags: Inter admissions Education News in Telugu TTWREIS Inter Admissions Gurukula Inter Admissions TTWREIS Admissions ST Gurukula Inter Admissions

సంబంధిత కథనాలు

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు