(Source: Poll of Polls)
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మార్చి-2023లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
* తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.
సీట్లు: 3680(బాలురు- 1680; బాలికలు- 2000)
రిజర్వేషన్: ఎస్సీలకు 75%, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2%, ఎస్టీలకు 6%, బీసీలకు 12%, మైనారిటీలకు 3%, ఓసీ/ ఈబీసీలకు 2% సీట్లు కేటాయించారు.
అర్హత: మార్చి-2023లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం); రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయోపరిమితి: విద్యార్థుల వయస్సు 31.08.2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష ఓమ్మార్ విధానంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 160 మార్కులకు ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. ఎంపీసీ- ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో, బైపీసీ- ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో, ఎంఈసీ/ సీఈసీ- ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2023.
➥ హాల్ టికెట్ డౌన్‌లోడ్ తేదీలు: 20.02.2023 నుంచి 04.03.2023 వరకు.
➥ స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 05.03.2023.
Also Read:
➥ తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
➥ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 'టీజీ యూజీసెట్', నోటిఫికేషన్ వెల్లడి! పరీక్ష ఎప్పుడంటే?
➥ టీఎస్ పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇలా!