News
News
X

TG UGCET Notification: గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 'టీజీ యూజీసెట్‌', నోటిఫికేషన్ వెల్లడి! పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు..

* టీజీ యూజీసెట్ - 2023

కోర్సులు: బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ (ఇంగ్లిష్ మీడియం)

అర్హత: ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్షలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతేనే ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటారు. మే, 2022లో 40 శాతం మార్కులతో ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా అర్హులే. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 కంటే తక్కువగా ఉన్న విద్యార్థులు అర్హులు.

డిగ్రీ కళాశాలలు:

1) టీఎస్‌డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, బుద్వేల్.

2) టీఎస్‌డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫర్ ఉమెన్, మహేంద్ర హిల్స్.

3) టీఎస్‌డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఫర్ ఉమెన్, సంగారెడ్డి.

4) టీఎస్‌డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఇబ్రహీంపట్నం.

5) తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ ఉమెన్, సిరిసిల్ల.

6) టీఎస్‌డబ్ల్యూఆర్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్, భువనగిరి.

7) తెలంగాణ సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో 23 కళాశాలలు

8)  టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో 15 మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయి. 

ఎంపిక ప్రక్రియ: టీజీయూజీసెట్-2023 ఆధారంగా సీటు కేటాయిస్తారు. టీఎస్‌డబ్ల్యూఆర్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్‌లో మాత్రం ప్రవేశ పరీక్షతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్షా విధానం, సిలబస్: అభ్యర్థి ఇంటర్మీడియట్‌లో చదివిన సబ్జెక్టుల ప్రకారం ప్రకటనలో పేర్కొన్న ఐదు టెస్టుల స్ట్రీమ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. OMR విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్/ తెలుగు మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం నాలుగు సబ్జెక్టు(జనరల్ ఇంగ్లిష్, మూడు ఐచ్ఛిక సబ్జెక్టులు)ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు 2 గంటలు.

పరీక్ష నిర్వహించే టెస్టుల స్ట్రీమ్: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.150.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.01.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 05.02.2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 05.03.2023.

Notification

Online Application

Website 

Also Read: 

TS SET - 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 30న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 05 Jan 2023 08:26 PM (IST) Tags: Telangana Gurukulam Under Graduate Common Entrance Test TGUGCET - 2023 TG UGCET Notification

సంబంధిత కథనాలు

Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!

Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!

CBSE Hall Tickets: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CBSE Hall Tickets: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NEET PG 2023: ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌, నీట్‌ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు

NEET PG 2023: ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌, నీట్‌ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు

AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్‌' రెండో విడత కౌన్సెలింగ్‌! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్‌' రెండో విడత కౌన్సెలింగ్‌! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

NEET PG 2023: నీట్‌ పీజీ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు - తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ కేంద్రం క్లారిటీ!

NEET PG 2023: నీట్‌ పీజీ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు - తప్పుడు వార్తల్ని నమ్మొద్దంటూ కేంద్రం క్లారిటీ!

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్