అన్వేషించండి

Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా

Tollywood Flashback: స్టార్ హీరోల సినిమాలు మధ్యలో ఆగడం ఉండదు. భారీ అంచనాలతో మొదలైన సినిమాలు అసలు ఆగవు. కానీ, వెంకటేష్ సినిమా ఒకటి మధ్యలో ఆగింది. అది ఏమిటో తెలుసా?

సాధారణంగా కొన్ని సినిమాలు కొంత షూటింగ్ జరుగుతున్న తర్వాత వివిధ రకాల ఇబ్బందులతో ఆగిపోవడం సహజం గా జరిగేదే. అయితే పెద్ద హీరోల సినిమాల్లో చాలా వరకూ అలా మధ్యలో ఆగిపోవడం జరగదు. కానీ భారీ అంచనాల మధ్య మొదలై పూర్తి కాకుండానే ఆగిపోయిన సినిమా ఒకటి ఉంది. అది జెన్ జీ అంతా ముద్దుగా 'వెంకీ మామ' అని పిలుచుకునే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh)ది కావడం విశేషం.

హిట్ డైరెక్టర్ RK సెల్వమణి దర్శకత్వం...
వెంకటేష్, కృష్ణంరాజు, విజయశాంతి మల్టీస్టారర్!
తమిళంలో 1990, 1991లో విజయకాంత్ (Vijayakanth)తో రెండు పెద్ద హిట్స్ ఇచ్చారు డైరెక్టర్ RK సెల్వమణి. ఆ రెండూ అయన తీసిన తొలి సినిమాలు. వాటిని తెలుగు ప్రొడ్యూసర్ CL నరసా రెడ్డి 'పోలీస్ అధికారి', 'కెప్టెన్ ప్రభాకర్' పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యాయి. హిట్ మాత్రమే కాదు... తమిళ్ లో వాటికి కల్ట్ స్టేటస్ వచ్చేయడంతో నిర్మాతలు సెల్వమణి వెంట పడుతున్న సమయం అది. అయితే తన సినిమాలను తెలుగులో డబ్ చేసిన నరసారెడ్డితోనే తెలుగులో రెండు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నారు సెల్వమణి. వాటిలో ఒకటి ప్రశాంత్, రోజా జంటగా కాస్త లో బడ్జెట్ లో తీసిన 'చామంతి' కాగా రెండోది పెద్ద బడ్జెట్ తో మొదలైన వెంకటేష్, విజయశాంతి మూవీ. 

చామంతి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపొయిన టైంలో వెంకటేష్ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. డిసెంబర్ 13, 1991న వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. 'ఇప్పుడు పార్టీ నేను ఇవ్వాలా లేక మీరే ఇస్తారా' అని వెంకటేష్ డైలాగ్ చెప్పడాన్ని తొలి షాట్ గా చిత్రీకరించారు. ఆ రోజు షూటింగ్ కి D. రామానాయుడు, మణిరత్నం లాంటి పెద్దలు హాజరయ్యారు. సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు, విజయశాంతి, శారద లాంటి భారీ తారాగణంతో పాటు బేబీ షామిలి లాంటి పాపులర్ నటులు ఉంటారని ప్రకటించారు. దానితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైలెట్ ఆఫీసర్ గా వెంకటేష్ ఈ సినిమా లో నటిస్తారని అప్పట్లో సెల్వమణి తెలిపారు.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

భారీ అంచనాలతో  ప్రారంభం అయిన వెంకటేష్ - సెల్వమణి సినిమా మధ్యలో ఆగిపోయింది. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్యపై సెల్వమణి తీసిన 'కుట్ర పత్రికై' సినిమా పూర్తిగా సెన్సార్ చిక్కుల్లో పడిపోవడంతో ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు వెంకటేష్ చంటి, సుందరకాండ లాంటి సినిమా లు సూపర్ హిట్ కావడం తో స్టార్ గా టాప్ 4లోకి ఎంటర్ అయిపోయారు. ఆ తరువాత ఏమైందో తెలియదు గానీ ఆ కాంబినేషన్ లో రావాల్సిన ఒక భారీ మల్టీ స్టారర్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

'చామంతి' హీరోయిన్ రోజానే పెళ్లి చేసుకున్న సెల్వమణి 
Rk సెల్వమణి తీసిన 'చామంతి ' సినిమా రోజాకు తమిళ్, తెలుగు భాషల్లో స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది.ఆ షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత రోజాతో వరుసగా కొన్ని సినిమాలు తీసిన సెల్వమణి... ఆమె 100 సినిమా 'దుర్గ'తో పెద్ద హిట్ ఇచ్చారు. ఈ జంట 2002లో పెళ్లి చేసుకున్నది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం రోజా ఏపీ రాజకీయాల్లో బిజీ గా ఉండగా సెల్వమణి తమిళనాడు డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా అప్పటి సెల్వమణి ట్రాక్ రికార్డ్ చూస్తే వెంకటేష్ తో మంచి ఇంటెన్స్ యాక్షన్ మూవీ ప్రేక్షకులు మిస్ అయ్యారని చెప్పవచ్చు.

Also ReadShiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget