అన్వేషించండి

TVk Vijay: తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?

Tamil Nadu Assembly Elections 2026: విజయ్ ఎన్డీఏలోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారన్నపుకార్లు తమిళనాడ షికారు చేస్తున్నాయి. అయితే తాము ఎవరికీ లొంగబోమని విజయ్ అంటున్నారు.

Is TVK Vijay in talks to join NDA:  తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం,  బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి మధ్య సాగుతున్నట్లుగా భావిస్తున్న రహస్య చర్చలే. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ అడుగులు వేస్తున్న తరుణంలో, ఈ ప్రచారం తమిళనాట పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రచారం వెనుక కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, ఆయనపై అన్ని వైపుల నుంచి వస్తున్న అసాధారణ ఒత్తిడి కూడా ఒక కారణమని  భావిస్తున్నారు.

కరూర్ తొక్కిసలాట - రాజకీయ అగ్నిపరీక్ష 

విజయ్ రాజకీయ ప్రస్థానంలో కరూర్ తొక్కిసలాట ఒక మాయని మచ్చగా మారింది. 2025 సెప్టెంబర్‌లో జరిగిన టీవీకే  ర్యాలీలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోవడం విజయ్‌ను తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది. ఈ ఘటనపై ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు సాగుతోంది. తాజాగా 2026 మార్చిలో కూడా సిబిఐ ఆయనకు వరుసగా నోటీసులు జారీ చేసింది. విచారణకు సమయం కోరుతున్నారు విజయ్. ఈ కేసులో విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి తెచ్చి, కూటమిలోకి రావాలని కర్చీఫ్ వేస్తోందని తమిళ రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది. ఒకవేళ ఎన్డీఏతో చేతులు కలిపితే ఈ లీగల్ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందనేది ఒక వాదన.

కుటుంబ సమస్యలు.. దెబ్బతిన్న  ఇమేజ్ 

రాజకీయాల్లోకి రాకముందు విజయ్ ఇమేజ్ ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉండేది. అయితే, సరిగ్గా పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడం   విజయ్‌కు వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ. పిల్లలను కూడా విజయ్ పట్టించుకోవడం  లేదన్న ప్రచారం జరుగుతోంది. భార్యతో రెండున్నర దశాబ్దాల   వైవాహిక బంధం ముగియడం, దాని వెనుక కొన్ని ఆరోపణలు రావడం ప్రత్యర్థి పార్టీలకు ఒక అస్త్రంగా మారింది. తమిళ ఓటర్లు వ్యక్తిగత నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, ఈ  ఫ్యామిలీ డ్రామా ఆయన రాజకీయ గ్రాఫ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. విజయ్ తన ఆఖరి సినిమాగా ప్రకటించిన జననాయగన్ కూడా సెన్సార్ చిక్కుల్లో పడింది.  ఒకవైపు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం తన అధికార బలంతో విజయ్ సభలకు అనుమతులు నిరాకరిస్తూ లేదా ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు కేంద్రం తనదైన శైలిలో చక్రం తిప్పుతోంది. ఈ రెండు వైపుల ఒత్తిడిని తట్టుకోలేక, ఏదో ఒక  పెద్ద అండ కోసం ఆయన ఎన్డీఏ వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

మైనర్ పార్టీగా విజయ్ సిద్ధమేనా? 

ఎన్డీఏలో చేరితే విజయ్ తన  ముఖ్యమంత్రి కలని వదులుకోవాల్సి వస్తుందా? అన్నదే అసలు ప్రశ్న. అన్నాడీఎంకే  తో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో, విజయ్ అక్కడ కేవలం ఒక స్టార్ క్యాంపెయినర్ గా మిగిలిపోవాల్సి రావచ్చు. కానీ, ప్రస్తుతం ఆయన చుట్టూ ఉన్న గందరగోళ పరిస్థితులు, సిబిఐ నోటీసులు, వ్యక్తిగత సమస్యల దృష్ట్యా.. రాజకీయ మనుగడ కోసం ప్రస్తుతానికి ఒక మెట్టు దిగక తప్పదని కొందరు విశ్లేషిస్తున్నారు. విజయ్ తన రాజకీయ సభల్లో  మేము ఎవరికీ లొంగం అని గంభీరంగా చెబుతున్నప్పటికీ, తెర వెనుక సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అటు డీఎంకే పెడుతున్న ఇబ్బందులు, ఇటు కేంద్రం చేస్తున్న దర్యాప్తు మధ్య నలిగిపోతున్న విజయ్.. తన పార్టీని కాపాడుకోవడానికి ఎన్డీఏ పంచన చేరతారా? లేక అన్నిటినీ తట్టుకుని ఒంటరి పోరాటం చేస్తారా? అనేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టమవ్వనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కూలడమే కేసీఆర్ అవినీతికి నిదర్శనం.. సీబీఐ విచారణ జరపాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కూలడమే కేసీఆర్ అవినీతికి నిదర్శనం.. సీబీఐ విచారణ జరపాల్సిందే: రేవంత్ రెడ్డి
Where is Harish Rao: కేసీఆర్ సభకు అందుబాటులో లేని హరీష్ రావు.. ట్రబుల్ షూటర్‌కు అంత ముఖ్యమైన పనేంటీ ?
కేసీఆర్ సభకు అందుబాటులో లేని హరీష్ రావు.. ట్రబుల్ షూటర్‌కు అంత ముఖ్యమైన పనేంటీ ?
Bengal Voter List: బెంగాల్ ఓటర్ లిస్టుపై గందరగోళం- పోలింగ్ 2 రోజుల ముందు వరకూ చేర్పులు- ఎవరి వైఫల్యం?
బెంగాల్ ఓటర్ లిస్టుపై గందరగోళం- పోలింగ్ 2 రోజుల ముందు వరకూ చేర్పులు- ఎవరి వైఫల్యం?
KCR re entry: జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Pachpadra Refinery: రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
Purusha: సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
Embed widget