News
News
X

NEET PG 2023: ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌, నీట్‌ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు

నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..

FOLLOW US: 
Share:

ఎంబీబీఎస్ అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నీట్ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవారే నీట్ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్రం తొలుత పేర్కొంది. ఆ కటాఫ్ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ గత నెల 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కొవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 30 లోపు అది పూర్తవ్వదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు నీట్ పీజీ పరీక్ష రాసేందుకు అనర్హులుగా మారే ముప్పు ఏర్పడింది. తాజా నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేలమంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఉపశమనం లభించినట్లయింది. వీరంతా ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 12 వరకు నీట్ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరగనుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు విన్నవిస్తున్నాయి. మరోవైపు- ఎండీఎస్ నీట్ రాసేందుకు వీలుగా బీడీఎస్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 7న ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఎండీఎస్ నీట్ అభ్యర్థులు ఫిబ్రవరి 10న సాయంత్రం 3 గంటల నుంచి ఫిబ్రవరి 12న అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నీట్- సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అర్హత ప్రమాణాన్ని 50 పర్సంటైల్ నుంచి 20 పర్సంటైల్‌కు కేంద్రం తగ్గించింది. జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)తో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష- 2023 తేదీని మార్చాలంటూ డిమాండ్లు వస్తోన్న వేళ ఆ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టుగా జరుగుతోన్న దుష్ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. అదంతా దుష్ప్రచారమేనని.. ఎవరూ నమ్మొద్దని స్పష్టంచేసింది. మార్చి 5న జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మార్పులు జరిగాయని.. మే 21కి మార్పు చేసినట్టు పేర్కొన్న ఆ నోట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నీట్ పీజీ 2023 పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందేశం సర్క్యులేట్ అవుతోంది. అది ఫేక్ సందేశం. ఇలాంటి నకిలీ సందేశాలను ఇతరులకు షేర్ చేయొద్దు అని ట్విటర్‌లో కోరింది.

Published at : 08 Feb 2023 10:22 AM (IST) Tags: Registration National Board of Examinations Ministry of Health and Family Welfare MBBS union health ministry MBBS aspirants

సంబంధిత కథనాలు

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్