Attack on Yadadri Collectorate Employee: యాదాద్రి కలెక్టరేట్ లో దారుణం - ఉద్యోగిపై మహిళా ఉద్యోగి కత్తితో దాడి
Telangana News: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద కత్తిపోట్లు కలకలం రేపాయి. ఓ మహిళా ఉద్యోగి, మరో ఉద్యోగిపై కత్తితో దాడికి పాల్పడింది.
![Attack on Yadadri Collectorate Employee: యాదాద్రి కలెక్టరేట్ లో దారుణం - ఉద్యోగిపై మహిళా ఉద్యోగి కత్తితో దాడి telangana news woman employee attacked to man emplyoee with knife in yadadri collectorate Attack on Yadadri Collectorate Employee: యాదాద్రి కలెక్టరేట్ లో దారుణం - ఉద్యోగిపై మహిళా ఉద్యోగి కత్తితో దాడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/e8f4e77645cb18f254f4c6c9a5a2341e1699617664457876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yadadri Collectorate: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ (Yadadri Collectorate)లో కత్తిపోట్లు కలకలం రేపాయి. ఓ మహిళా ఉద్యోగి మరో ఉద్యోగిపై కత్తితో దాడికి పాల్పడింది. ఆత్మకూరు (Atmakuru) మండలంలో ఏఈవోగా (AEO) పని చేస్తున్న మనోజ్ పై మండల వ్యవసాయ అధికారిణి (ఏవో) శిల్ప కత్తితో దాడి చేశారు. దీంతో మనోజ్ మెడ, వీపు భాగాలపై గాయాలయ్యాయి. అప్రమత్తమైన తోటి సిబ్బంది బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఏవో కార్యాలయంలోనే వీరి మధ్య గొడవ మొదలైంది. పరస్పరం వాదించుకుంటూనే కార్యాలయం బయటకు రాగా గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఏవో శిల్ప, మనోజ్ పై కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు శిల్పను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు మహిళా ఉద్యోగిని చెబుతుండగా, వ్యక్తిగత కారణాలతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాగా, మహిళా ఉద్యోగిని శిల్పకు సుధీర్ అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉన్న ఆమె, మనోజ్ తో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Sangareddy News: నా ఇజ్జత్ తీసినవ్, ఇక్కడే సచ్చిపోతా అన్నా - కిషన్ రెడ్డితో బీజేపీ లీడర్ ఆవేదన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)