Crime News: గంటల వ్యవధిలో 20 మంది మృతి.. ఏం జరిగి ఉంటుంది?
బిహార్ రాష్ట్రంలో అనుమానస్పద మరణాలు కలకలం రేపుతున్నాయి. గంటల వ్యవధిలో 20 మంది మృతి చెందారు.
బిహార్‌లో 24 గంటల వ్యవధిలో 20 మంది అనుమానాస్పదంగా మృతి చెందారు. కల్తీ మద్యం తాగడంతోనే ఇలా జరిగి ఉంటుందని అధికారులు అనుకుంటున్నారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని కుషాహర్, మహ్మద్‌పుర్ గ్రామాల్లో బుధవారం రోజున 12 మంది చనిపోయారు. అయితే మరుసటి రోజు అంటే ఇవాళ మరో 13 మంది చనిపోయారు. సాయంత్రం వరకు.. బెతియా పట్టణం దగ్గరలోని తెల్హువా గ్రామంలో మరో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మెుత్తం 20 మంది మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ఇంత మంది మరణించడం కలకలం రేపుతుంది. కల్తీ మద్యం తాగడం వలనే చనిపోయి ఉంటారని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ మద్యం సేవించడం వల్లే వీరంతా మృతిచెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. 20 మంది చనిపోవడమే.. కాదు.. మరి కొంతమంది అస్వస్థతకు కూడా గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. కొంతమందికి ఇతర సమస్యలు కూడా వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి కంటిచూపు తగ్గుతున్నట్టు చెప్పారు.
దీపావళి పండగ రోజు.. 20 మంది మృతితో కలకలం రేగింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆయా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hyderabad Crime: పంజాగుట్టలో రోడ్డుపై బాలిక శవం.. ఎవరైనా చంపి పడేశారా?
Also Read: Hyderabad: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్
Also Read: Anantapur: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..
Also Read: Karimnagar: ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రిపూట సిట్టింగ్.. ఇంతలో పోలీస్ సైరన్, ముంచుకొచ్చిన మృత్యువు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి