Horrors of Hotel Room 308: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?

మార్కెటింగ్ డిగ్రినీ పూర్తి చేసిన తర్వాత ఆమె అడ్వేంచర్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంది. అనుకోకుండా ఓ మూర్ఖుడి వలలో చిక్కుకుని జీవితాన్ని కోల్పోయింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది?

FOLLOW US: 

మె పేరు గ్రేస్ ఎమ్మిరోజ్ మిల్లాన్. ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో జన్మించిన ఆమె.. ముగ్గురు తోబుట్టువుల్లో చిన్నది. ఆ కుటుంబానికి ఆమె అంటే చాలా ఇష్టం. ఎంతో ఫ్రెండ్లీగా ఉండే గ్రేస్.. సృజనాత్మకతను ఇష్టపడేది. ఎంతో చక్కని చిత్రాలను గీస్తూ ఆకట్టుకొనేది. గ్రేస్.. లింకన్ విశ్వవిద్యాలయం నుంచి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ డిగ్రినీ పూర్తి చేసిన తర్వాత.. అడ్వేంచర్ ట్రిప్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. 

అక్టోబర్ 2018లో గ్రేస్ తన అడ్వేంచర్ ట్రిప్‌ను మొదలుపెట్టింది. మొదట పెరూను సందర్శించింది. ఆ తర్వాత నవంబర్ 19న గ్రేస్ న్యూజిలాండ్ చేరుకుంది. 11 రోజులు ఆమె ఆక్లాండ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంది. అక్కడ ఆమె కొంతమంది ప్రయాణికులతో తన గదిని షేర్ చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. ఆమె తన కుటుంబికుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు కూడా సమాధానం ఇవ్వలేదు. దీంతో కంగారుపడి న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపులు చేపట్టారు. 

గ్రేస్ ఏమైంది?: ఆమె విదేశీ పర్యాటకురాలు కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె బస చేసిన హోటల్ నుంచి ఆమె ఎక్కడిక్కడికి వెళ్లిందో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాల్లోని సీసీటీవీ కెమేరా వీడియోలను పరిశీలించారు. ఎట్టకేలకు పోలీసులు గ్రేస్ ఎక్కడెక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలుసుకుందనే సమాచారాన్ని సేకరించగలిగారు. సీసీటీవీ ఫూటేజ్‌లో ఆమె ఓ యువకుడిని కలుసుకున్నట్లు కనిపించింది. అతడికి హగ్ ఇవ్వడమే కాకుండా.. కాసేపు అతడితో క్లోజ్‌గా షికారు చేస్తున్నట్లు వీడియోల్లో కనిపించాయి. 

యువకుడితో డేటింగ్: 11 రోజులు హాస్టల్‌లో ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండటానికి బోర్ కొట్టిందో ఏమో.. ఆమె టిండర్ యాప్ ద్వారా ఓ యువకుడిని ఎంపిక చేసుకుంది.  అతడితో పరిచయం పెంచుకుంది. డిసెంబరు 1, 2018న సాయంత్రం 6 గంటలకు ఆమె హాస్టల్ నుంచి నేరుగా అతడిని కలిసేందుకు వెళ్లింది. వారిద్దరు కలిసి సిటీ సెంటర్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా గ్రేస్ తన ఫ్రెండ్ అన్నాకు రెండు మెసేజ్‌లు పంపింది. అందులో తన డేట్ బాగా జరుగుతోందని తెలిపింది. అతడితో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. అందులో ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by millanegrace (@millanegrace)

రూమ్ నెంబర్ 308లో..: డేటింగ్‌లో భాగంగా ఆమె ఆ యువకుడితో కలిసి సిటీ లైఫ్ హోటల్‌లో రూమ్ నెం.308లోకి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఆ తర్వాతి రోజు పుట్టిన రోజు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేసి విష్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె నుంచి రిప్లయ్ లేదు. ప్రతి రోజూ తన ట్రిప్ గురించి అప్‌డేట్ చేసే గ్రేస్.. ఆ రోజు మాత్రం ఏ వివరాలు తెలపలేదు. దీంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు  ఆక్లాండ్ పోలీసులను సంప్రదించారు. 

ఎవరా మిస్టరీ మ్యాన్?: పోలీసులు.. ఆమె ఉంటున్న హాస్టల్‌ను సందర్శించారు. ఆమె విలువైన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. దీంతో ఆమె ఆ రాత్రి ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్లి నిద్రపోయి ఉంటుందని భావించారు. కానీ, ఆ తర్వాతి రోజు కూడా ఆమె నుంచి సమాధానం రాలేదు. సీసీటీవీ కెమేరాలోని వీడియోలను ఆధారంగా ఆమె కోసం గాలించారు. ఆ వీడియోలో ఉన్న యువకుడిని పట్టుకుంటే మొత్తం వివరాలు బయటకు వస్తాయని తెలుసుకున్నారు. ఆ రాత్రి ఆమెతో ఉన్న మిస్టరీ మ్యాన్‌ను జెస్సీ కెంప్సన్‌గా గుర్తించారు.

జెస్సీ కెంప్సన్ ఎవరు?: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌‌కు చెంది జెస్సీ.. తన కుటుంబ సభ్యులను, స్నేహితులను చనిపోయినట్లు నమ్మించి అందరికీ దూరంగా ఉంటున్నాడు. అతడికి అబద్ధాలకోరుగా పేరుంది. తన ఇంటి యజమానితో సైతం ఎన్నో అవాస్తవాలు చెప్పాడు. అతను న్యూజిలాండ్ జాతీయ సాఫ్ట్‌బాల్ జట్టు బ్లాక్ సాక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రొఫెషనల్ సాఫ్ట్‌బాల్ ప్లేయర్ అని చెప్పాడు. అతడు చెప్పిన అసత్యాలకు ఎన్నో ఉద్యోగాలను, వసతులను కోల్పోయాడు. ఆవారాగా తిరుగుతూ.. టిండర్‌లో తానో గొప్ప వ్యక్తిగా చెప్పుకొనేవాడు. అలాంటి సమయంలో గ్రేస్ అతడికి పరిచయమైంది.

మళ్లీ అవాస్తవం చెప్పాడు, కానీ..: పోలీసులు జెస్సీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదని జెస్సీ తెలిపాడు. కౌగిలింత, చెంపపై ముద్దు తప్పా ఇంకేమీ జరగలేదన్నాడు. రాత్రి 10 గంటలకు తిరిగి వెళ్లిపోయామని తెలిపాడు. అయితే, అతడి నేపథ్యం గురించి ముందే తెలుసుకున్న పోలీసులు అతడు చెప్పిన హోటల్‌లోని సీసీటీవీ వీడియోల ద్వారా ఒక్కో చిక్కు ముడిని విడదీస్తూ వచ్చారు. మొత్తానికి అతడే గ్రేస్‌ను హత్య చేశాడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. 

ఆ రాత్రి ఏం జరిగింది?: జెస్సీ, గ్రేస్ డిసెంబర్ 1 రాత్రి.. సిటీ లైఫ్ హోటల్‌కు చేరుకున్నారు. డిసెంబరు 2న ఉదయం అతడు పెద్ద సూట్ కేసు, ఓ మాల్‌లో క్లినింగ్ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మరో యువతితో డేటింగ్ చేయడానికి వెళ్లాడు. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లి.. రాత్రి 9.30 గంటలకు జెస్సీ రెండు సూట్‌కేసులను బయటకు తీసుకువస్తూ సీసీటీవీ కెమేరాకు చిక్కాడు. అద్దెకు తీసుకున్న ఓ రెడ్ కలర్ కారులో ఆ సూట్‌ కేసులను పెట్టాడు. డిసెంబరు 3వ తేదీన ఉదయం 7 గంటలకు జెస్సీ పార కొనుగోలు చేశాడు. ఇది కూడా అక్కడి ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. అనంతరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ సూట్‌కేసుతో సహా గ్రేస్‌ను పూడ్చిపెట్టాడు. అనంతరం అద్దెకు తీసుకున్న కారును శుభ్రం చేసి తిరిగి ఇచ్చేశాడు. అతను అదే రోజు అద్దెకు తీసుకున్న కారును కడిగి తిరిగి ఇచ్చాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by millanegrace (@millanegrace)

ఎందుకు చంపాడు?: పోలీసులు రూమ్ నెం.308లో సోదాలు జరపగా.. అక్కడ గ్రేస్ రక్తపు మరకలు కనిపించాయి. విచారణలో జెస్సీ నిజాన్ని అంగీకరించాడు. ఆ రాత్రి తాను, గ్రేస్ సెక్స్‌లో పాల్గొన్నామని, ఆమె మరింత మొరటుగా చేయాలని కోరడంతో మెడ పట్టుకుని చేశానన్నాడు. ఆ తర్వాత ఆమె నుంచి స్పందన రాకపోతే నిద్రపోయిందని భావించానన్నాడు. ఉదయం నిద్రలేచి చూస్తే గ్రేస్ ముక్కు నుంచి రక్తం కారుతూ కనిపించిందని, ఆమెను కదిపి చూస్తే చలనం కనిపించలేదని తెలిపాడు. ఆ రోజు ఆమె అంగీకరింతోనే శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపాడు. ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత ఏం చేయాలో పాలుపోలేదని, సూట్‌కేసు తీసుకొచ్చి ఆమె శవాన్ని అందులో పెట్టానని పేర్కొన్నాడు. వెయిటకెరె రిజర్వాయర్ సమీపంలో రోడ్డుకు పది గజాల దూరంలో గ్రేస్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెలిపాడు.

Also Read: NNN అంటే ఏమిటీ? నవంబరులో శృంగారానికి ఎందుకు దూరంగా ఉండాలి?

ప్రధాని క్షమాపణలు: పోస్ట్‌మార్టంలో గ్రేస్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆమె చేతులు, ఛాతిపై కూడా గాయాలున్నాయి. సుమారు ఐదు నిమిషాలపాటు ఆమె మెడపై ఒత్తిడి పడినట్లు తెలుసుకున్నారు. మరి, గ్రేస్ నిజంగా రఫ్ సెక్స్ వల్ల మరణించిందా? లేదా జెస్సీ ఆమెను కావాలనే హత్య చేశాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. 21 ఫిబ్రవరి 2020న సుప్రీం కోర్టు జెస్సీకి 17 సంవత్సరాల నాన్-పెరోల్, జీవిత ఖైదు విధించబడింది. దీనిపై పలుసార్లు జెస్సీ అప్పీల్ చేసుకున్నా కోర్టు తిరస్కరించింది. అయితే, ఈ ఘటన కొత్త వ్యక్తులతో డేటింగ్‌ చేసే అమ్మాయిలకు ఒక హెచ్చరికలాంటిది. వన్ నైట్ స్టాండ్ అంటూ.. కొత్త వ్యక్తులతో శృంగారంలో పాల్గొవడం ఎంత ప్రమాదకరమనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. 

Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Nov 2021 05:49 PM (IST) Tags: Grace Millane Grace Millane Murder Horrors of Hotel Room 308 Room number 308 గ్రేస్ మిల్లనే రూమ్ నెంబర్ 308 Murder Mystery

సంబంధిత కథనాలు

Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

Worst Person You Know: ఇతడు ‘మీకు తెలిసిన చెత్త వ్యక్తి’, అర్థం కాలేదా? ఈ ఫొటో ఎంతపని చేసిందో చూడండి!

Worst Person You Know: ఇతడు ‘మీకు తెలిసిన చెత్త వ్యక్తి’, అర్థం కాలేదా? ఈ ఫొటో ఎంతపని చేసిందో చూడండి!

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

టాప్ స్టోరీస్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Vishal No Politics :  కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

Rahgurama :  నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా -  సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !