అన్వేషించండి

NNN అంటే ఏమిటీ? నవంబరులో శృంగారానికి ఎందుకు దూరంగా ఉండాలి?

నవంబరు నెలలో పురుషులంతా లైంగిక చర్యలకు దూరంగా ఉండాలట. 30 రోజులు నిగ్రహంగా ఉండేవాళ్లు.. తర్వాతి నెలలో ‘డిస్ట్రాయ్ డిసెంబర్‌’లో పాల్గోవచ్చట. అర్థం కాలేదా? అయితే చూడండి.

మనకు #RRR గురించి తెలుసు. కానీ.. కొత్తగా #NNN ఎక్కడ నుంచి వచ్చిందనేగా మీ సందేహం? మీరు అనుకున్నట్లు ఇది సినిమా మాత్రం కాదు. ఇదో పురుషోద్యమం. చెప్పాలంటే ఇదో సరికొత్త దీక్ష. నవంబరు నెల మొదలైందంటే చాలు.. పురుషులంతా శృంగారానికి బైబై చెప్పేస్తారు. కనీసం స్వయంతృప్తి కూడా పొందకూడదు. చివరికి పోర్న్ చూసినా #NNN నిబంధనను అతిక్రమించినట్లే. ఇంతకీ ఏమిటీ NNN అనేగా మీ సందేహం? NNN అంటే నో నట్ నవంబర్ (No Nut November). 

ఛీ.. పాడు ఇదే కల్చర్ అని ముక్కున వేలు వేసుకోవద్దు. ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైనది కాదు. 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో కొందరు NNN పేరుతో నవంబరు నెల మొత్తం నిగ్రహంగా ఉంటున్నారు. నవంబరు మొదలైందంటే చాలు.. వీరంతా బుద్ధిమంతులైపోతారు. అశ్లీలత పేరు వింటే చాలు చిర్రెత్తుకొస్తుంది. ఇప్పటి వరకు రెడిట్ సోషల్ మీడియా ద్వారా 90 వేల మంది No Nut November మీద అవగాహన కల్పిస్తున్నారు. 30 రోజులపాటు సంఘీభావం తెలుపుతూ.. మీమ్స్ పోస్ట్ చేస్తారు. నెల మొత్తం శృంగారం, స్వయంతృప్తికి దూరంగా ఉంటారు. 

ఎందుకు చేస్తారు?: సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది వాటిని నియంత్రించుకోలేరు. దానివల్ల పోర్న్ వీడియోలు చూడటం, స్వయంగా తృప్తి పొందడం, భాగస్వామితో కోరికలు తీర్చుకోవడంలో బిజీగా ఉంటారు. ఇలాంటి చర్యలకు కనీసం ఒక నెల విరామం తెలిపితే.. ఆరోగ్యానికే కాకుండా మనసుకు కూడా చాలామంచిదని నో నట్స్ నవంబర్ ఫాలోవర్ల భావన. ఈ సందర్భంగా ఈ నెలను ఛాలెంజ్‌గా తీసుకుంటారు. తాము ఎంత వరకు నిగ్రహంగా ఉండగలమనేది పరీక్షించుకుంటారు. సెక్స్ మీద మనసు మరలకుండా ఉండేందుకు ఇతర విషయాల మీద దృష్టిపెడతారు. దీనివల్ల మానసిక స్పష్టత ఏర్పడుతుంది. ఒక వేళ ఈ దీక్షను పాటించడంలో విఫలమైతే.. వారు తమ లైంగిక జీవితాన్ని కొనసాగించవచ్చు.  

NNN నిబంధనల ప్రకారం.. 30 రోజుల వరకు ఎలాంటి లైంగిక చర్యలకు పాల్పడకూడదు. కనీసం పోర్న్ చూసిన విఫలమైనట్లే. కేవలం సెక్స్ కలలను కనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. 2010 నుంచి కొంతమంది పురుషులు దీన్ని నిష్టగా పాటిస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల సింగిల్స్ సక్సెస్‌ఫుల్‌గా NNN పాటించారట. అయితే భాగస్వామితో ఇళ్లకే పరిమితమైన పురుషులు మాత్రం దీన్ని పాటించకలేపోయారట. లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారిలో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందట. 

Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!

ఈ ఏడాది నుంచి NNN నిబంధనను కాస్త కఠినం చేశారట. ఈ ఏడాది NNNలో భాగస్వాములయ్యేవారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే సముద్ర తీరాన్ని శుభ్రం చేసే పనుల్లో పాల్గొనే టీమ్‌కు కోసం రోజుకు ఒక డాలర్ చొప్పున విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉద్యమాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ప్రారంభించారనే వాదన నడుస్తోంది. ఎక్కువ రోజులు సెక్స్‌కు దూరంగా ఉండే పురుషులు, సెక్స్ అంటే ఇష్టం లేని వ్యక్తులు, స్త్రీ ద్వేషులు ఇలా ‘నో నట్స్ నవంబర్’ పేరుతో ఇతరులను పరీక్షించాలని చూస్తున్నారనే పలువురు అంటున్నారు. ఇతరులు నెల రోజులపాటు లైంగిక చర్యల్లో పాల్గోకుండా ఎంత నిగ్రహంగా ఉంటారో చూడాలనే కాన్సెప్ట్‌తోనే దీనికి తెరతీశారని అంటున్నారు. అయితే.. ‘నో నట్స్ నవంబర్‌’లో పాల్గొనేవారి కోసం డిసెంబరు నెలలో ‘డిస్ట్రాయ్ డిసెంబర్’లో పాల్గొనవచ్చని అంటున్నారు. ‘డిస్ట్రాయ్ డిసెంబర్’ అంటే ఏం చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో! అయితే, నవంబరు మొత్తం నిగ్రహంగా ఉంటూ తమని కోరికల నుంచి నియంత్రించుకొనే వ్యక్తులు.. డిసెంబరులో అవకాశం దొరికినా ఆ పని చేస్తారో లేదో అనేది మాత్రం డౌటే. 

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget