X

Kiss The Bride: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!

వధువరులు వేదికపై ముద్దు పెట్టుకోవడం పెద్ద తప్పు కాదు. కానీ, అక్కడ ఏకంగా పెళ్లికి వచ్చే అతిథులే వారిని ముద్దు పెట్టుకుంటారట.

FOLLOW US: 

పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు గిఫ్టులు ఇస్తారని తెలుసు. కానీ, అక్కడ మాత్రం వేదికపైనే వధువు లేదా వరుడిని ముద్దాడుతారు. ఔనండి..  ఆ వేదికపైనే పురుషులు వధువును, మహిళలు వరుడిని ముద్దాడతారు. ఇదేదో కొ(చె)త్తగా ఉందే అని అనుకుంటున్నారా? అయితే, మీరు స్వీడన్‌లోని ఈ పెళ్లి తంతు గురించి తెలుసుకోవల్సిందే. 

పాశ్చాత్య దేశాల్లో జరిగే పెళ్లిలో.. వధువరులు అతిథుల ముందు ముద్దుపెట్టుకోవడం సాధారణమే. పెళ్లిలో భాగంగా అందరి ముందు పెదాలతో ముద్దాడుకుని తమ పెళ్లికి అంగీకారాన్ని తెలుపుతారు. అయితే, స్వీడన్‌లో మాత్రం విభిన్న సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. పెళ్లి రిసెప్షన్‌లో కొత్తగా పెళ్లయిన జంటలో వధువును పురుషులు.. వరుడిని మహిళలు ముద్దాడతారు. వరుడు వేదికను వదిలి వెళ్లిన తర్వాత వధువు తరపున వచ్చే అతిథులు, బంధువుల్లోని పురుషులు ఆమెను ముద్దాడతారు. అలాగే.. వధువు వేదికను వదిలిన తర్వాత వధువు తరపు అతిథులు, బంధువుల్లోని మహిళలు వచ్చి వరుడిని ముద్దాడుతారు. అయితే, వీరిలో ఎక్కువ మంది వధువరులకు తెలిసిన బంధువులే ఉంటారు కాబట్టి.. వారికి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదట. 

Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

శోభనం మూడు రోజులు.. బాత్రూమ్ బంద్: బోర్నియాలో మరో వింత సాంప్రదాయం ఉంది. అక్కడి గిరిజనులు పెళ్లి తర్వాత జరిగి శోభనం తంతులో చుక్కలు చూపిస్తారు. వధువరులను మూడు రోజులు ఒక గదిలో బందించడమే కాదు.. కనీసం మూత్రానికి కూడా వెళ్లనివ్వరు. మొదటి రాత్రి వారికి బాగానే ఉంటుంది. మిగతా రెండు రోజులు వారికి నరకమే. మలమూత్ర విసర్జనను కంట్రోల్ చేసుకోవాలి. అరిచి గీ పెట్టినా సరే వారు తలుపులు తీయరు. ఈ పరిస్థితి వల్ల కనీసం ఏకాంతంగా కూడా కలవలేరు. ఎందుకింత హింసిస్తారని ప్రశ్నిస్తే.. పెళ్లయిన మూడు రోజుల్లో వధువరుల్లో ఎవరైనా మలమూత్రాలకు పోతే.. ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెబుతున్నారు. అంతేగాక.. ఆ మూడు రోజులు వాటిని నియంత్రించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలోపేతం అవుతుందని చెబుతున్నారు. అయితే, ఇలాంటి సాంప్రదాయాలు పాటించకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మూడు రోజులపాటు ఉగ్గబెట్టుకుని ఉండటం వల్ల మూత్ర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

Tags: Kiss The Bride Borneo Wedding Culture Borneo Toilet వధువుకు ముద్దులు Sweden Kiss Ritual Sweden Wedding Ritual

సంబంధిత కథనాలు

Trust Your Spouse: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...

Trust Your Spouse: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Kim Jong-Un: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

Kim Jong-Un: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

Stomach Bloating: పొట్ట బయటకు తన్నుకొస్తుందా? మీరు చేసే ఈ చిన్న తప్పులే కారణం!

Stomach Bloating: పొట్ట బయటకు తన్నుకొస్తుందా? మీరు చేసే ఈ చిన్న తప్పులే కారణం!

Morning Headache: నిద్ర లేవగానే తల నొప్పి వేధిస్తోందా? ఈ కారణాలు తెలుసుకోవల్సిందే!

Morning Headache: నిద్ర లేవగానే తల నొప్పి వేధిస్తోందా? ఈ కారణాలు తెలుసుకోవల్సిందే!

టాప్ స్టోరీస్

Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

Shiva Shankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..

Shiva Shankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..

Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..