News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad Crime: ఫామ్ హౌస్ పేకాట కేసులో వెలుగులోకి సంచలన విషయాలు... ప్రధాన నిందితుడిపై భూకబ్జా కేసులు... అరెస్టైన 30 మంది రిమాండ్ కు తరలింపు

హైదరాబాద్ శివారులో పేకాట శిబిరం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పేకాట ఆడుతున్న 30 మందిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ పై ఆరా తీస్తున్నారు.

FOLLOW US: 
Share:

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని ఓ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహణ కేసులో పోలీసుల విచారణ పూర్తయింది. పేకాట ఆడుతున్న 30 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ టాలీవుడ్‌ యంగ్‌ హీరో తండ్రి దగ్గర నుంచి అద్దెకు తీసుకొని పేకాట ఆడించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక సుమన్ మొబైల్ లో ప్రముఖులు, వీఐపీల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలతో ఏపీలో కూడా ఈ పేకాట స్థావరాలు నిర్వయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..

గుత్తా సుమన్ గుట్టురట్టు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఫామ్‌ హౌస్ పై దాడి కేసులో పోలీసుల విచారణ పూర్తి చేశారు. ఫామ్‌ హౌస్ లో పేకాట నిర్వయిస్తున్న గుత్తా సుమన్ ను ప్రధాన నిందితుడుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన పక్క సమాచారంతో మంచిరేవుల ఫామ్ హౌస్ పై దాడి చేశారు. 30 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఓ ఐఏఎస్ అధికారి నుంచి ఆరు నెలలు క్రితం ఐదు సంవత్సరాలకు టాలీవుడ్ హీరో ఈ ఇంటిని లీజ్ కు తీసుకున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ ను  హీరో తండ్రి మణికొండకి చెందిన గుత్తా సుమన్ కు అద్దెకు ఇచ్చాడు. దీంతో  ఫామ్ హౌస్ లోని రెండు ఫ్లోర్లలో పేకాట కోసం ఏడు టేబుల్స్ ఏర్పాటు చేసి పేకాట ఆడిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఫామ్ హౌస్ లోని రెండో ఫ్లోర్ లో నాలుగు టేబుల్స్, మూడో ఫ్లోర్ లోని మూడు టేబుల్స్ ఏర్పాటు చేసి ఆడిస్తున్నట్లు తేలింది. గుత్తా సుమన్ స్వయంగా మిగిలిన 29 మందిని పిలిచి పేకాట ఆడించినట్లు తేలింది. పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ గతంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు

బడా నేతల సంబంధాలు

వీరిలో బెజవాడ, హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతో సుమన్‌కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుత్తా సుమన్‌ ఫామ్‌ హౌస్ ను అద్దెకు తీసుకుని పేకాట ఆడిస్తుంటాడని, విజయవాడలోని మామిడి తోటలో గుత్తా సుమన్‌ పేకాట క్లబులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమన్ చౌదరిపై విజయవాడలో భూ కబ్జా కేసు కూడా నమోదైంది. బడా రాజకీయ నేతలతో ఫొటోలు దిగి తనకు పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఎన్జీవో పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన సుమన్ చౌదరి, ఏపీలో పలు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పట్టుబడిన ముప్పై మందిని పోలీసులు రిమాండ్ కి తరలించారు. నిందితులు నుంచి రూ.6 లక్షల 77 వేలు నగదు, 31 సెల్ ఫోన్స్, 29 ప్లేయింగ్ కార్డ్స్ బాక్స్ , స్వైపింగ్ మిషన్,  కాసినో కాయిన్స్, మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ అండర్ సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదు చేశారు. మ

రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

గత కొన్నేళ్ల నుంచి క్యాసినోలు గుత్తా సుమన్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్ లో క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా సుమన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. లక్షల్లో పేకాట ఆడే వారిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడే వారి కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్ చాటింగ్ లో పేకాట ఆడే స్థలం షేర్ చేస్తున్నారన్నారు. డబ్బులను ఆన్లైన్ లో డిపాజిట్ చేస్తే పాయింట్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. పేమెంట్ మొత్తం డిజిటల్ రూపంలోనే వసూలు చేసి, ప్రతి సిట్టింగ్ కోట్లు లావాదేవీలు నిర్వహిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బర్త్ డే పార్టీల పేరుతో స్టార్ హోటల్ లు అద్దెకు తీసుకుని క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Also Read: నాగశౌర్య విల్లాలో పేకాట క్లబ్..ప్రముఖలే ఖాతాదారులు ! హీరోది సైడ్ బిజినెస్సా ? స్నేహితులు ఇరికించేశారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 07:54 PM (IST) Tags: Hyderabad crime TS News Telangana crime Casino games Playing card rummy games

సంబంధిత కథనాలు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

టాప్ స్టోరీస్

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ