అన్వేషించండి

NagaSourya Playcards : నాగశౌర్య విల్లాలో పేకాట క్లబ్..ప్రముఖలే ఖాతాదారులు ! హీరోది సైడ్ బిజినెస్సా ? స్నేహితులు ఇరికించేశారా ?

నాగశౌర్య లీజుకు తీసుకున్న విల్లాలో పేకాట క్లబ్ నిర్వహించడం కలకలం రేపుతోంది. పేకాట ఆడుతున్న 20 మంది ప్రముఖుల్ని అరెస్ట్ చేశారు. పేకాట డెన్ నిర్వహిస్తున్నదెవరన్న దానిపై విచారణ జరుపుతున్నారు.


అది హైదరాబాద్‌ శివారులో ఉన్న ఫామ్‌హౌస్ లాంటి గెస్ట్ హౌస్. ఫామ్ తక్కువ... హౌస్ ఎక్కువ. ఓ రకంగా విల్లా. అందులో రాత్రంతా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. పూర్తిగా తెల్లవారక ముందే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దాంతో ఆ ఇంట్లో నుంచి బిలబిలమని కొంత మంది బయటకు వచ్చి పారిపోవాలని చూశారు. కానీ అప్పటికే పోలీసులు రౌండప్ చేసేశారు. దీంతో ఎవరూ పారిపోలేకపోయారు. అందరూ చిక్కారు.  దాదాపుగా 20 మంది. అందర్నీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్పాట్‌లో జరిగిన సీన్ ఇది. కనీ ఆ తర్వాతే అసలు డ్రామా ప్రారంభమయింది. 

Also Read : అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు

మంచి రేవుల సమీపంలో ఉన్న ఆ విల్లా ఎవరిదో బయటకు తలియడంతోనే అసలు ఈ రొటీన్ క్రైమ్ కథకు చాలా గ్లామర్ చేరిపోయింది. ఆ విల్లాలో పట్టుబడిన ఇరవై మంది పేకాట ఆడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సవాలక్ష పేకాట రహస్య శిబిరాల్లో అదీ ఒకటి. కానీ అక్కడ దొరికిపోయారు. దొరికిన వాళ్లు దొంగలు కాబట్టి వాళ్లు కూడా దొరికిపోయారు. అయితే వారు పేకాట ఆడుతున్న  విల్లా యువ హీరో నాగశౌర్య లీజుకు తీసుకున్నదన్న విషయం బయటకు తెలిసిన తర్వాత సాదాసీదా కేసుకు కావాల్సినంత గ్లామర్ చేరుకుంది. కావాల్సినంత రచ్చ ప్రారంభమయింది. 

Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..

నాగశౌర్య లీజుకు తీసుకున్న విల్లాలో పేకాట ఆడుతున్న వారిలో ప్రముఖులు ఉన్నారు. శ్రీరామ్ భద్రయ్య అనే ఓమాజీ ఎమ్మెల్యేతో పాటు హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ వాసవి యజమానుల్లో ఒకరైన రాజారామ్ ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ మోసగాడిగా పోలీస్ రికార్డుల్లో ఉండి.. ఎవరికీ చిక్కకుండా తిరిగే మద్దతు ప్రకాష్ అనే వ్యక్తి కూడా పేకాట ఆడుతూ దొరికిపోయిన వారిలో ఉన్నారు. మిగతావారిలోనూ ప్రముఖులు ఉన్నారని చెబుతున్నారు కానీ వారెవరో బయటకు రావడం లేదు. వీరందర్నీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
NagaSourya Playcards :  నాగశౌర్య విల్లాలో పేకాట క్లబ్..ప్రముఖలే ఖాతాదారులు ! హీరోది సైడ్ బిజినెస్సా ?  స్నేహితులు ఇరికించేశారా ?

( మద్దుల ప్రకాష్, పేకాట స్థావరంలో దొరికిన వ్యక్తి )

Also Read:  భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం

నటుడు నాగశౌర్య లీజుకు తీసుకున్నాడు కాబట్టి ఆ పేకాట క్లబ్‌ను ఆయనే నిర్వహిస్తున్నారా అన్న అనుమానాలు మొదట్లో పోలీసులు వ్యక్తం చేశారు. అయితే కాస్త లోతుగా విచారణ జరిపిన తర్వాత లీజు  హీరోదే అయినా.. అయనకు విలన్‌గా పరిచయస్తుడు అయిన గుత్తా  సుమన్ కుమార్ ఉన్నట్లుగా తేల్చారు. ఈ గుత్తా సుమన్ కుమారే మొత్తం కింగ్ పిన్‌గా పోలీసులు  ఓ అంచనాకు వచ్చి ఫోన్ సీజ్ చేశారు. అయితే ఈ సుమన్ వెనుక నాగసౌర్య బాబాయ్ బుజ్జి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి వారికి నోటీసులు జారీ ప్రశ్నించనున్నారు.
NagaSourya Playcards :  నాగశౌర్య విల్లాలో పేకాట క్లబ్..ప్రముఖలే ఖాతాదారులు ! హీరోది సైడ్ బిజినెస్సా ?  స్నేహితులు ఇరికించేశారా ?

( వాసవి గ్రూప్ రాజారామ్.. పేకాట శిబిరంలో దొరికిన వ్యక్తి )

Also Read : భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం

ప్రైవేటు ఫామ్‌హౌస్‌లు, ఇళ్లలో పేకాట శిబిరాలు విస్తృతంగా నిర్వహిస్తూ ఉంటారు. సమాచారం అందిన చోట పోలీసులు పట్టుకుంటూనే ఉంటారు. అయితే ఇదేమంత పెద్ద సీరియస్ కేసులు కాదని చెబుతూంటారు. ఏపీకి చెందిన ఓ మంత్రి మాటల్లో చెప్పాలంటే " పేకాట ఆడితే ఏమవుతుంది.. యాభై రూపాయల ఫైన్ కట్టి మళ్లీవచ్చి బయట ఆడుకుంంటారు అంతే.. ఉరేమీ వేయరు కదా..!"  అంతే. కానీ ఇక్కడ సినిమా నటుడు నాగశౌర్య పేరు రావడంతో  హైలెట్ అవుతుంది. 

Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget