By: ABP Desam | Updated at : 30 Oct 2021 03:19 PM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ అద్దె ఇంట్లో రహస్యంగా నిర్వహకులు ఈ దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. తొలుత ఓ మహిళను తీసుకొచ్చి ఇంట్లో ఉంచి, విటులను ఆకర్షించారు. ఇలా గుట్టుగా సాగుతున్న ఈ దందా హైదరాబాద్ కేపీహెచ్‌బీలో బట్టబయలు అయింది. ముందు అద్దెకు తీసుకున్న ఇంట్లో సాధారణంగానే అందరిలో నమ్మకం కలిగించేలా ఉన్న నిర్వహకులు తర్వాత వ్యభిచారం మొదలు పెట్టారని పోలీసులు తెలిపారు.
ముందు ఓ మహిళను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించడం మొదలు పెట్టగా.. విషయం బయటపడింది. ఆ నోట ఈ నోట చివరికి వార్త పోలీసులను చేరింది. దీంతో మాటు వేసిన పోలీసులు అదును చూసి వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 4లో జరిగింది. బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దరు వ్యక్తులు కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 4లో ఎంఐజీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
Also Read: మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం... కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన యువతి
అక్కడికి ఓ మహిళను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా యువకులను ఆకర్షిస్తూ వ్యభిచారం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వహకులు, మహిళతోపాటు శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసినట్లు కేపీహెచ్‌బీ పోలీసులు వెల్లడించారు.
Also read: కూర్చుని - నిల్చునే ఈ టెస్ట్ చెప్పేస్తుంది... వచ్చే అయిదేళ్లలో మీ ఆరోగ్యం గురించి
ఇటీవల ఎస్ఆర్ నగర్‌లోనూ గుట్టురట్టు
కొద్ది రోజుల క్రితం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వ్యభిచార ముఠా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశీ యువతులను నకిలీ పాస్ పోర్టులు, పత్రాలతో రప్పించి గుట్టుగా వ్యవభిచారం నిర్వహిస్తున్నారు. ఈ రాకెట్ గురించిన సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్ నగర్‌లోని బాపు నగర్ రోడ్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు విటులు, నలుగురు మహిళలు ఉన్నారు.
Also Read: Sircilla: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..
Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Accidents In Tirumala Ghat Road: తిరుమల ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు, 12 మందికి గాయాలు
రూమ్‌లో ఫుల్‌గా ఏసీ పెట్టుకుని పడుకున్న డాక్టర్, చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి
Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో దర్శకుడు సహా రచయిత అరెస్టు, వాళ్లెవరంటే?
సోషల్‌మీడియా ఖాతాలకు లైక్ కొట్టారో, మీ ఖాతా ఖాళీ
Women Deaths: ఖమ్మంలో ఇంటర్ స్టూడెంట్ మృతి- విశాఖలో నగ్నంగా కనిపించిన మహిళ డెడ్ బాడీ!
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
/body>