Miss Telangana Suicide Attempt : మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం... కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన యువతి
మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. ఇటీవల లైవ్ వీడియో పెట్టి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే పోలీసులు రక్షించారు. తాజాగా మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు ఆమెను రక్షించారు.
మాజీ మిస్ తెలంగాణ హాసిని(21) మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇటీవల ఇన్ స్టాలో లైవ్ పెట్టి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు ఆమెను రక్షించారు. తాజాగా ఆమె మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుంచి మున్నేరులో దూకి హాసిని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను గుర్తించి రక్షించారు. ఆమెను కాపాడి నందిగామ ఆసుపత్రి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి
ఇన్ స్టాగ్రామ్ వీడియో కాల్ చేసి ఆత్మహత్యాయత్నం
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని(21) హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటుంది. 2018లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన పోటీలో ‘మిస్ తెలంగాణ’గా ఎంపికైంది. హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇన్ స్టా గ్రామ్ లో వీడియో పెట్టి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేస్తున్నట్లు తల్లిదండ్రులు, స్నేహితులకు తెలిపింది. ఆత్మహత్య తప్పని తెలుసినా తప్పడంలేదని, మన్నించండని వీడియో కాల్ లో ఆవేదన వ్యక్తం చేశారు. తనను మానసికంగా వేధించారని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆమె వీడియోలో తెలిపారు.
Also Read: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..
ఆర్థిక ఇబ్బందులే కారణమా...?
ఈ వీడియో చూసిన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందగానే నారాయణగూడ పోలీసులు ఆమె ఉండే అపార్టుమెంట్‌కు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి హాసిని రక్షించారు. చున్నీ ముడి విడిపోయి ఆమె మంచంపై పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హాసినిని పోలీసులు ప్రశ్నించగా ఆర్థిక ఇబ్బందులని తెలిపినట్లు సమాచారం. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి హాసినిని తమ సొంతగ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ తీసుకెళ్లారు. ఆమె ఇవాళ మరోసారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
Also Read: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు
Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి