Miss Telangana Suicide Attempt: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు
మాజీ మిస్ తెలంగాణ లైవ్ వీడియో పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. వీడియో చూసిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి రక్షించారు. ఓ యువకుడు వేధిస్తున్నట్లు ఇటీవలె ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
![Miss Telangana Suicide Attempt: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు Hyderabad former miss Telangana attempted suicide put live video police rescued her Miss Telangana Suicide Attempt: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/28/7072cbb39bc7cfb8b319847ef7d033a4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్ ఓ యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆమెను రక్షించారు.
యువకుడు వేధిస్తున్నాడని కేసు
మాజీ మిస్ తెలంగాణ లైవ్ వీడియో పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తాను ఉరి వేసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్ పోస్టు చేసింది. ఆ వీడియో చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన పోలీసులు.. హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉంటున్న యువతిని రక్షించారు. ఆమెను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. యువతి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ యువతి 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. ఇటీవలే ఓ యువకుడిపై వేధిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి
హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రేమోన్మాది యువతిపై దాడిచేశాడు. వట్టి నాగులపల్లికి చెందిన యువతి తన ప్రేమను నిరాకరించిందని ప్రేమ సింగ్ అనే యువకుడు హత్యయత్నం చేశాడు. యువతి ఇంటిలో చొరబడి బంధించి గొంతు, చేతి మణికట్టు వద్ద కోశాడు. ఆమె భయంతో అరవడంతో బంధువులు, స్థానికులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. దీంతో స్థానికులు బాధితురాలిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కేపీహెచ్‌బీలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ యువకుడు బుధవారం రాత్రి తమ ఇంటికి వచ్చి దాడి చేసినట్లుగా బాధిత యువతి తల్లిదండ్రులు తెలిపారు. ఈ దాడిలో యువతికి స్వల్పగాయాలయ్యాయన్నారు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు తాగిన మైకంలో ఈ హత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. యువతిపై దాడి చేయడంతోనే స్థానికులు నిందితుడ్ని పట్టుకుని చితకబాదారు. దాడిలో ప్రేమ్ సింగ్ కూడా గాయపడడంతో అతణ్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)