Hyderabad Realtor: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..
బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని రవీందర్‌రెడ్డి ఇంటికి వచ్చి మోహన్ రెడ్డి సెల్లార్‌లో మాటు వేశాడు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మోహన్ రెడ్డి కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్‌లో కత్తి దాడికి గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి రవీందర్ చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం రవీందర్ రెడ్డి మృతి చెందారు. ఈ రవీందర్ రెడ్డిపై అల్లుడు మోహన్ రెడ్డి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ రెడ్డి మరణించారు. అక్కడి నుంచి రవీందర్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రవీందర్ రెడ్డి పని చేశారు. రెండేళ్ల కిందట బేగంపేట ప్రాంతంలో దాదాపు 600 గజాల స్థలాన్ని ఈయన కొన్నారు. ఆ స్థలం కొనుగోలులో మోహన్ రెడ్డి మధ్యవర్తిత్వంగా వ్యవహరించగా.. అందుకోసం అతనికి కమిషన్ ఇవ్వాల్సి ఉంది. ఆ కమిషన్ డబ్బులు రూ.6 లక్షలు ఇవ్వకపోవడంతో మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చంపేయాలని భావించి రవీందర్ రెడ్డిపై మోహన్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Also Read: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్.. కాదు.. కాదంటున్న బీజేపీ
మాటు వేసి కత్తితో దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 78లోని అంజనీస్ ఒయాసిస్ అపార్ట్‌మెంట్‌లో బిల్డర్ రవీందర్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని రవీందర్‌రెడ్డి ఇంటికి వచ్చి మోహన్ రెడ్డి సెల్లార్‌లో మాటు వేశాడు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రవీందర్ రెడ్డి కారులో ఎక్కుతుండగా మోహన్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రవీందర్ రెడ్డి కుప్పకూలాడు. రవీందర్ రెడ్డి కేకలు విని ఆయన భార్య అమూల్య రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆపేందుకు యత్నించింది.
దీంతో మోహన్‌రెడ్డి అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రవీందర్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Huzurabad BJP : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !
Also Read: Huzurabad ByPolls: ఈటల, గెల్లు శ్రీనివాస్.. వీరి బలం, బలహీనతలు ఏంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి