By: ABP Desam | Updated at : 26 Oct 2021 03:25 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో నేతలు జోరు పెంచారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపురంలో మంత్రి హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 'మాకు అన్నం పెట్టిన ఊరు. ఆతిథ్యం ఇచ్చిన ఊరు సింగాపురం. మమ్మల్ని ఆశీర్వదించండి. మరింత సేవ చేస్తాం' అని హరీశ్ రావు అన్నారు. ఆసరా, కళ్యాణ లక్ష్మీ పథకాలు కడుపు నింపవని ఈటల రాజేందర్ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈటల హుజూరాబాద్ కు చేసిందేమిటి హరీశ్ రావు ప్రశ్నించారు.
Also Read : హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!
గెలిచినా ఈటల మంత్రి అయ్యేది లేదు
ఆసరా పింఛన్, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు ప్రజల కడుపులు నింపవని ఈటల రాజేందర్ విమర్శించారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీర్ కిట్ పనికి రాదని, రైతుంబంధు దండగ అని విమర్శలు చేశారని హరీశ్ రావు అన్నారు. ఆసరా పింఛన్ పరిగ ఏరుకున్నట్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తున్నామో తమకు తెలుసన్నారు. ఈటల రాజేందర్ శ్రీమంతుడు కాబట్టి అతనికి ఇవి అవసరం లేదు ఆసరా పింఛన్ ఎందరికో అండగా నిలిచిందన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌కు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. గెల్లు శ్రీనుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అబద్దాల బీజేపీ మాటలు నమ్మవద్దన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచేదేమి లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదన్నారు. ధరలు పెంచిన బీజేపీని ప్రజలు ఎందుకు గెలిపిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఇంకా కష్టపడి పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటామని హరీశ్ రావు అన్నారు.
Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !
భారీగా కేంద్ర బలగాలు మోహరింపు ఎందుకు? : బాల్క సుమన్
బీజేపీ డైరెక్ట్ గా ఎదుర్కొలేక కేంద్ర ప్రభుత్వం ద్వారా సీఈసీని వాడుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. సీఈసీని కేంద్రం జేబు సంస్థలా వాడుకుందన్నారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 2000 మంది జవాన్లతో కూడిన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలను హుజూరాబాద్ కి చేరుకున్నాయని తెలిపారు. ఇంత భారీ ఎత్తున బలగాల మోహరింపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి నేరుగా రిపోర్ట్ చేసే అధికారులు ఇక్కడ ఉండి ఏంచేస్తున్నారని బాల్క సుమన్ ప్రశ్నించారు.
Also Read: ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు