News
News
X

TRS Plenary KCR : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !

అభివృద్ధిలో దేశం కన్నా తెలంగాణ ముందు ఉందని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ ప్లీనరీలో మట్లాడారు. ఇప్పుడు ఏపీలో చీకట్లు ఉంటే తెలంగాణలో వెలుగులు ఉన్నాయన్నారు.

FOLLOW US: 

" రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి వెళ్లిపోతుదని అన్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు ఉంటే .. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని "  సీఎం కేసీఆర్ తెలంగాణ సాధిస్తున్న పురోగతిని టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా విశ్లేషించారు. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. 

పొరుగు రాష్ట్రాలు..ఏపీలోనూ టీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుతున్నారు ! 

తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు.  తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను తమకు అమలు చేయకపోతే .. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని నాందేడ్ వాసులు, కర్ణాటకలోని రాయచూర్ వాసులు కోరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున తమ పార్టీని అక్కడ కూడా పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను తమకూ కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారన్నారు. 

ఏపీ కన్నాతెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ !

తెలంగాణ వస్తే కారుచీకటై పోతుందన్నారు. నక్సలైట్ల రాజ్యమొస్తుందని భయపెట్టారని కేసీఆర్ విమర్శించారు. ఇక్కడ బతకలేని పరిస్థితి ఉంటుందని, తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతగాదని, భూముల ధరలు పడిపోతాయని, అన్నారు. కానీ... ఇప్పుడు జరిగిందేమిటి? భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాల్లోనే అనేక రంగా ల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది. తొలిదశ వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టిన పంజాబ్‌ను తలదన్ని 3 కోట్ల టన్ను ల వరిధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేస్తోందన్నారు. మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.35 లక్షలకు పెరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో మనమే టాప్‌. తలసరి ఆదాయంలో కూడా దేశంలోని మొదటి రెండు స్థానాల్లో ఉన్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

Also Read : హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!

తెలంగాణ పథకాలను దేశం మొత్తం కాపీ కొడుతున్నారు ! 

స్వాప్నాలను శాసించే ధైర్యం ఉండాలని.. లేకుండా తెలంగాణ వచ్చేది కాదన్నారు. వనరులు సమైక్య పాలకులు ఎన్నోఇబ్బందులు పెట్టారన్నారు. జాగ్రత్తగా వాడుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం మొత్తం తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మోయడానికి హమాలీలు,  ఆడించడానికి మిల్లులు సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నా విపక్షాలు కేసుల మీద కేసులు వేస్తున్నారని విమర్శించారు. అయితే ఛేదింంచుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగామ ధరణి ఓ అద్భుతమైన విప్లవం అని అభివర్ణించారు. దేశానికి తెలంగాణ తల మానికంగా ఉందని.. దేశం కంటే తెలంగాణ ముందు ఉందన్నారు. చరిత్రలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్లేవారని ఇప్పుడు పనులు ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. నాది తెలంగాణ అని ప్రతి ఒక్కరు తల ఎత్తుకునే స్థాయికి తీసుకెళ్లామన్నారు. 

Also Read : డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్

దళిత బంధు అమలు చేసే శక్తి ఒక్క టీఆర్ఎస్‌కే ఉంది !

దళిత బంధు పథకంపై కేసీఆర్ ఎక్కువ సేపు ప్రసంగించారు. దళితులకు చేయగలిగినంత చేస్తామన్నారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న వారికి సాంత్వన ఈ పథకమన్నారు. ఏపీ నుంచి కూడా దళిత బంధు అమలు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు 70 ఏళ్లకుపైగా పరిపాలించినా ఏమీ చేయలేకపోయాయని.. దళితుల దుస్థితికి వాళ్లే కారణమన్నారు. ఇప్పుడు దళితబంధు అమలు చేసే శక్తి ఒక్క టీఆర్ఎస్‌కు మాత్రమే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. రూ. లక్షా 70వేల కోట్లతో అమలు చేస్తామన్నారు. దళిత బంధుతోనే ఆగదని.. బీసీ, గిరిజన, ఈబీసీ వర్గాలతో పాటు అన్ని వర్గాలకూ పథకాలను వర్తింప చేస్తామన్నారు. 

Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !

టీఆర్ఎస్‌కు రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు !

తెలంగాణ రాష్ట్ర సమితిని నడిపిస్తోంది.. తెలంగాణ ప్రజలేనన్నారు. తెలంగాణ నలువైపులా ప్రజా పునాది పటిష్టంగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రూ. 240  కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని.. వాటిపై వచ్చే రూ. రెండు కోట్ల వడ్డీతో పార్టీని నడిపిస్తున్నామని.. జిల్లాల్లో కార్యాలయాలు నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 

Also Read : బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి

హుజురాబాద్ విషయంలో ఎన్నికల సంఘానికి కేసీఆర్ హెచ్చరిక !

సభలో హుజురాబాద్ ఎన్నికలపైనా కేసీఆర్ స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరిస్ోతందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు. నవంబర్ నాలుగు తర్వాత గెల్లు శ్రీనివాస్ పథకాన్ని అమలు చేస్తారని ప్రకటించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దంగావ్యవహరించారని.. ఇది మీకు గౌరవం కాదన్నారు. ఇది తన హెచ్చరికగా కేసీఆర్ ఈసీకి తెలిపారు. బహిరంగసభ పెట్టకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ దళిత బిడ్డలు అదృష్టవంతులన్నారు. 

Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

9వ సారి అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక 

మరో వైపు ప్లీనరీలో మొదటగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగీవ్రంగా ఎన్నికయినట్లుగా ప్రకటించారు.  హైటెక్స్‌లో జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీలో ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి.. కేసీఆర్‌ ఎన్నికను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Also Read : దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Oct 2021 12:53 PM (IST) Tags: TRS party kcr Telangana Rashtra Samithi TRS Plenary TRS President KCR Telangana Development

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: పలాసలో వర్షాల ధాటికి కుప్పకూలిన రెండస్తుల భవనం 

Breaking News Live Telugu Updates: పలాసలో వర్షాల ధాటికి కుప్పకూలిన రెండస్తుల భవనం 

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

Garikapati Narsimharao : చిరంజీవిపై గరికపాటి సీరియస్, అసూయ పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

VH On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, కేసీఆర్ చేస్తుంది డూప్ ఫైట్ - వీహెచ్

టాప్ స్టోరీస్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Anasuya: 'గాడ్ ఫాదర్'కి అనసూయ దూరం - ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

Anasuya: 'గాడ్ ఫాదర్'కి అనసూయ దూరం - ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!