By: ABP Desam | Updated at : 24 Oct 2021 07:45 AM (IST)
Edited By: Venkateshk
Bathukamma in Burj Khalifa
ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం అయిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ సంస్కృతి మెరిసింది. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ అంతర్జాతీయ వేదికపై ఆవిష్కృతమైంది. బుర్జ్ ఖలీఫా భవనంపై బతుకమ్మ, బోనాల చిత్రాలు మెరిశాయి. బుర్జ్ ఖలీఫాపై ఇప్పటివరకు భారత్‌కు చెందిన వారిలో మహాత్మాగాంధీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చిత్రాలను మాత్రమే ప్రదర్శించారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, కవిత ఫోటో ప్రదర్శితమైంది.
మూడు నిమిషాలపాటు ప్రదర్శన
తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను శనివారం సాయంత్రం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. బతుకమ్మ వీడియోను బుర్జ్ ఖలీఫా తెరపై రెండుసార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని సైతం బుర్జ్ ఖలీఫా తెరపై ప్రదర్శించారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. జై తెలంగాణ.. జై తెలంగాణ.. అంటూ తెలుగులో కనిపించింది. దీంతో ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన రాష్ర్టానికే గాక, దేశానికి సైతం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది
ఈ కార్యక్రమానికి ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేశ్‌గుప్తా, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, విజయ్‌భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.
Also Read: ఈటలతో సమావేశం బహిరంగ రహస్యం... కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్
ప్రదర్శన సాగింది ఇలా..
బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 830 మీటర్లు. ప్రపంచంలోనే అతి ఎత్తైన మానవ నిర్మిత భవనం. దానిపై లేజర్ లైట్లతో వీడియో ప్రదర్శితమైంది. బతుకమ్మను బుర్జ్ ఖలీఫాపై 8 రంగుల్లో ఆవిష్కరించారు. బతుకమ్మ చిత్రంతో బుర్జ్ ఖలీఫా మొత్తం రంగులమయమైంది. ఆ తర్వాత మూడు భాషల్లో బతుకమ్మ పేరును ప్రదర్శించారు. ‘ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్.. బతుకమ్మ’ అని ప్రదర్శించి ఆ తర్వాత ఇంగ్లీష్, తెలుగు, అరబ్ భాషల్లో బతుకమ్మ పేరును ప్రదర్శించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర చిత్ర పటం ప్రదర్శితమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ ప్రదర్శించారు. ఆ తర్వాత జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై జై తెలంగాణ నినాదాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ జాగృతి పేరును కూడా ప్రదర్శించారు. ఈ లేజర్ షో జరుగుతున్నప్పుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘అల్లీపూల’ బతుకమ్మ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించింది.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది