Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది
హయత్ నగర్ లో కారులో మృతదేహం కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. మరిదితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది.
వివాహేతర సంబంధాలు హత్య చేసేందుకు దారి తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ హత్యలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన భర్తను హత్య చేసింది. మరిది సాయంతో మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్ వేసింది. కారులో మృతదేహాన్ని తరలిస్తుండగా కారు ఆగిపోయింది. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో మృతదేహంపై కారం జల్లిపారిపోయారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని తమదైన శైలిలో రాబట్టారు.
Also Read: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
అసలేం జరిగింది?
హైదరాబాద్ హయత్‌నగర్‌లో కారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు కిరాతంగా హత్య చేశారని అందరూ భావించారు. బావర్చీ హోటల్ సమీపంలోని రోడ్డుపై కారులో శవాన్ని వదిలేసి వెళ్లారు. ఆ కారు పార్కింగ్ చేసి ఉందని భావించారు. కారు వెనుక సీట్లో అనుమానంగా ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి కారు తలుపులో తీసి చూడగా ఓ మృతదేహం కనిపించింది. శవంపై కారం జల్లి ఉండడం, రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు ఆరా తీశారు. కారు నంబర్ ప్లేట్ సగం విరిగి ఉండడంతో వివరాలు తెలియలేదు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
Also Read: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు
వివాహేతర సంబంధమే కారణం
హత్య కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. కారులో దారుణ హత్యకు గురైన లారీ డ్రైవర్ కాచిగూడకి చెందిన మహుమద్ ముస్తాక్ గా పోలీసులు గుర్తించారు. మృతుడు భార్య, తమ్ముడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. హత్య జరిగిన అనంతరం నగర శివారులో మృతదేహాన్ని పడేసేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై కారు ఆగిపోవడంతో మృతదేహాంపై కారం చల్లి వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య, తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి