Gachibowli: హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి
వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కేపీహెచ్‌బీలోని ఓ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ యువకుడు బుధవారం రాత్రి తమ ఇంటికి వచ్చి దాడి చేసినట్లుగా బాధిత యువతి తల్లిదండ్రులు తెలిపారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమోన్మాది ఘాతుకం చేశాడు. యువతిని హత్య చేసేందుకు యత్నించాడు. వట్టి నాగులపల్లిలో ప్రేమను నిరాకరించిందని ప్రేమ సింగ్ అనే యువకుడు యువతి ఇంటిలో చొరబడి ఆమెను బంధించాడు. గొంతు, చేతి మణికట్టు వద్ద కోశాడు. అమ్మాయి అరుపులతో బంధువులు, స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో స్థానికులు బాధితురాలిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?
వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కేపీహెచ్‌బీలోని ఓ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ యువకుడు బుధవారం రాత్రి తమ ఇంటికి వచ్చి దాడి చేసినట్లుగా బాధిత యువతి తల్లిదండ్రులు తెలిపారు. ఈ దాడిలో యువతికి స్వల్పగాయాలు అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, నిందితుడు తాగిన మైకంలో ఈ హత్యాయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. యువతిపై దాడి చేయడంతోనే స్థానికులు నిందితుడ్ని పట్టుకొని చితకబాదారు. చివరికి ప్రేమ్ సింగ్ కూడా గాయపడడంతో అతణ్ని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Murder Case: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..
Also Read: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి