By: ABP Desam | Updated at : 26 Oct 2021 09:10 AM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
ప్రకాశం జిల్లా ఒంగోలు.. గ్రామానికి చెందిన నాగచైతన్య ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన కోటి రెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్ని రోజులు ఉద్యోగం లేకుండా తిరిగిన అతడు.. ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేరాడు. పనిలో భాగంగా ఎప్పుడూ.. నాగ చైత్యన్య పని చేసే ఆసుపత్రికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిద్దరికి పరిచయం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెబితే ఒప్పుకోరు అని అనుకున్నారు.
నాగ చైతన్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.. ఆమె తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల కిందట తండ్రి కూడా మృతి చెందాడు. నాగచైతన్యకు సవతి తల్లి మాత్రమే ఉంది. కోటిరెడ్డి, నాగ చైతన్య ప్రేమ విషయం వారి ఇళ్లలో తెలిసింది. సామాజిక వర్గాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు కుటుంబ సభ్యులు. ఈ పరిస్థితుల్లో ఒంగోలులో ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చింది నాగ చైతన్య. సిటీలోనే ఓ వైద్యశాలలో పని చేస్తోంది.
ప్రియురాలిని కలవాలని ఈ నెల 22న హైదరాబాద్ వచ్చాడు కోటిరెడ్డి. ఇద్దరూ లాడ్జిలో ఓ గది అద్దెకు తీసుకున్నారు. 23వ తేదీ రాత్రిపూట నాగచైతన్య హత్యకు గురైంది. ఈ విషయం గమనించిన లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ కోటిరెడ్డి మాత్రం కనిపించలేదు. దీనిపై చందానగర్ పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. హైదరాబాద్ లాడ్జీలో అదృశ్యమైన కోటిరెడ్డి సోమవారం ఒంగోలు జీజీహెచ్ లో దర్శనమిచ్చాడు. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. ఇద్దరూ కలిసి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నాడు. కత్తి పోట్ల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు ఆ తర్వాత ఏమైందో తెలియని చెప్పాడు. బంధువులు ఎవరో తనను కాపాడి.. ఒంగోలు వైద్యశాలలో చేర్పించినట్టు వెల్లడించారు. కోటిరెడ్డి కోసం వెతుకుతున్న చందానగర్ పోలీసులు.. సోమవారం ఒంగోలు జీజీహెచ్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. కోటిరెడ్డే చంపేసి... నాటకం ఆడుతున్నాడా? అసలేం జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Also Read: Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...
Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం
Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!
Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?