By: ABP Desam | Published : 31 Oct 2021 05:30 PM (IST)|Updated : 31 Oct 2021 05:31 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య(ప్రతీకాత్మక చిత్రం)
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగుడి కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మరణించారు. తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) న్యూజెర్సీలో ప్లెయిన్స్‌బోరోలో నివాసం ఉంటున్నారు. 2014 నుంచి అరెక్స్ ల్యాబోరేటరీస్ ఫార్మా సంస్థ సీఈవోగా ఆయన పని చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున(స్థానిక కాలమానం) 3.30 గంటలకు ఇంట్లో ఉన్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్ జాన్(27)గా పోలీసులు గుర్తించారు.
Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..
80 కిలో మీటర్లు వెంబడించి ఇంట్లో దొంగతనం
శ్రీరంగ తన ఇంటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్క్స్ క్యాసినోలో మంగళవారం అర్ధరాత్రి 10,000 డాలర్లు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న రీడ్ జాన్ గమనించాడు. ఆ డబ్బు దోచుకోవడానికి శ్రీరంగను కారులో రీచ్ వెంబడించాడు. శ్రీరంగను 80 కిలోమీటర్లు వెంబడించి ఇంటిదాకా వచ్చాడు. శ్రీరంగ ఇంట్లోకి రాగానే అతడిపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీరంగ ఘటనాస్థలిలోనే కన్నుమూశారు. రీడ్ జాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. శ్రీరంగ అర్వపల్లికి స్థానికంగా మంచి పేరు ఉందని తెలుస్తోంది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
నమ్మశక్యంగా లేదు
శ్రీరంగకు స్థానికంగా మంచి పేరుంది. దుండగుడి కాల్పుల్లో మరణించడంపై నమ్మలేకపోతున్నామంటూ అక్కడి స్థానికులు ఆవేదన చెందారు. జరిగిన ఘటన షాకింగ్‌గా ఉందని శ్రీరంగ పక్కింట్లో ఉండే షీజా ఖాన్ అన్నారు. 80 కిలోమీటర్లు కార్లో వెంటాడి మరీ ఇంట్లో చొరబడి దొంగతనం చేయడానికి వచ్చాడంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇది భయాందోళనలకు గురిచేసే విషయమని షీజా ఖాన్ అన్నారు. ఏ పండుగ వచ్చినా అందరినీ పిలిచి చాలా బాగా నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితమే శ్రీరంగ ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారని చెప్పారు. శ్రీరంగ చాలా కష్టపడే వ్యక్తి అని పొరుగింట్లో ఉండే అభీ కనిత్కర్ చెప్పారు.
Also Read: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?
Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?