Hyderabad Murder: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
భర్త నిద్ర పోతున్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య అతణ్ని చంపించింది. రాజేంద్ర నగర్ సమీపంలో ఈ దారుణం జరిగింది.
పరాయి వ్యక్తితో ఓ మహిళ ఏర్పర్చుకున్న అక్రమ సంబంధం చివరికి హత్యకు దారి తీసింది. ఏకంగా ప్రియుడి సాయంతో భర్తనే తుదముట్టించింది. భర్త నిద్ర పోతున్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడింది. దీంతో మహిళ, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని హైదరాబాద్‌లోని పహాడీషరీష్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ఆటో, రెండు బైక్‌లు, ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం ఎల్ బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి విలేకరులకు వివరించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ అనే 35 ఏళ్ల వ్యక్తి స్థానికంగా పాల వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్ మోయిన్ బాగ్‌లో ఉంటోంది. అదే ప్రాంతంలో ఉండే సయ్యద్ ఫరీద్ అలీ అలియాస్ సోహైల్ అనే 27 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త షేక్ ఆదిల్‌కు కొన్నాళ్ల క్రితమే తెలిసిపోయింది. దీంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపుల విషయాన్ని జోయా బేగం ప్రియుడైన ఫరీద్ అలీకి చెప్పింది. తమ బంధానికి ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం రచించారు.
Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..
ఉరి బిగించి, కత్తితో పొడిచి..
దాని ప్రకారం.. నిందితుడు ఫరీద్ అలీ తన స్నేహితుల సాయం తీసుకున్నాడు. స్నేహితులు ముహమ్మద్ రియాజ్, షేక్ మావియా, మహ్మద్ జహీర్‌లతో కలిసి ప్రియురాలి పిలుపు మేరకు ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో జోయా బేగం భర్త నిద్రిస్తున్నాడు. ఇంట్లో నిద్రలో ఉన్న షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ మేడకు అందరూ కలిసి చున్నీతో ఉరి బిగించారు. అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. ఆ తర్వాత షేక్ ఆదిల్ శవాన్ని ఆటో ట్రాలీలో ఎవ్వరూ చూడకుండా ఎక్కించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి సమీపానికి తరలించి అక్కడ శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.
రక్తం అంటిన తమ బట్టల్ని కూడా ఎవ్వరికీ ఆధారాలు దొరక్కుండా కాల్చేశారు. మరోవైపు, కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతణ్ని షేక్ ఆదిల్ అని గుర్తించారు. విచారణ మొదలు పెట్టగా.. వివాహేతర సంబంధం ఉండడం వల్లే భార్య ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు గుర్తించారు. హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు శనివారం రిమాండ్‌కు తరలించారు.
Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి