By: ABP Desam | Updated at : 02 Nov 2021 09:31 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
రాత్రి వేళ స్నేహితులతో కలిసి సరదాగా మందు పార్టీ చేసుకుంటున్న ఓ గ్రూపులో తీరని విషాదం ఏర్పడింది. చీకట్లో బహిరంగంగా అంతా కూర్చొని సిట్టింగ్ వేయడం ఒకరు చనిపోవడానికి కారణమైంది. పోలీసులు రోజూ చేసే పెట్రోలింగ్‌లో భాగంగా వాహన సైరన్ విని కంగారు పడ్డ అందరూ తలో దిక్కుకు పారిపోయారు. ఈ క్రమంలో అందులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయాడు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం తాగుతుండగా పోలీస్ సైరన్ విని పరిగెత్తి, ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు వివరించిన వివరాల ప్రకారం.. మోత్కుల గూడేనికి చెందిన పొనగంటి వేణు అనే 34 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గా కాలనీలో ఇతను నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య స్వాతి. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేరు అద్విక, కృత్రిక ఉన్నారు. వేణు ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నాడు. మరోవైపు, తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ కూడా కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
ఆదివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి, సరదాగా జమ్మికుంట ప్రధాన రోడ్డుకు సమీపంలోని ఓ రెస్టారెంట్ ఎదురుగా మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సైరన్ మోగించుకుంటూ రావడంతో వారికి దొరవద్దనే కారణంతో నలుగురు స్నేహితులు తలో దిక్కుకు పరుగులు తీశారు. దీంతో చీకట్లో పరిగెత్తుతున్న వేణు ప్రమాదవశాత్తు పొలంలోని బావిలో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో ఉన్న పలువురికి బావిలో ఏదో పడిన శబ్ధం వినిపించడంతో వెంటనే వెళ్లారు. వేణు అందులో పడిపోయినట్లుగా గుర్తించారు.
ఆ చీకట్లోనే ప్రమాదకరంగా ఉన్న బావిలో ముగ్గురూ దూకి వేణు కోసం వెతికారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. కొక్కేలతో ఉన్న బకెట్‌కు తాడు కట్టి కూడా వెతికారు. వేణుకు సంబంధించిన ఆచూకరీ గుర్తించగా.. చివరకు అతణ్ని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బయటకి తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.అయితే, వేణు బహిర్భూమి కోసం అటు వైపు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడని మృతుడి భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ వెల్లడించారు.
Also Read : అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!
Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం, యమునా నదిలో పడవ బోల్తా , 17 మంది గల్లంతు!
Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!
Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!
Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?