Hyderabad Crime: పంజాగుట్టలో రోడ్డుపై బాలిక శవం.. ఎవరైనా చంపి పడేశారా?
పంజాగుట్టలో ఓ బాలిక రోడ్డుపై శవంగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఆ చిన్నారిది ఎలా మరణించిందన్న దారిపై స్పష్టత లేదు. ఎవరైనా హతమార్చి అక్కడ పడేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
![Hyderabad Crime: పంజాగుట్టలో రోడ్డుపై బాలిక శవం.. ఎవరైనా చంపి పడేశారా? Hyderabad: 4 Years old girl dead body found on road near Panjagutta Hyderabad Crime: పంజాగుట్టలో రోడ్డుపై బాలిక శవం.. ఎవరైనా చంపి పడేశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/10/de2dbdd3cf184acda7c2c3b8eebcd961_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లో దీపావళి పండుగ వేళ ఓ ఘాతుకం వెలుగు చూసింది. పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో రోడ్డుపై గుర్తు తెలియని చిన్నారి శవం కనిపించింది. ఈ ఘటన చూసి స్థానికులు అవాక్కయ్యారు. బాలిక వయసు నాలుగేళ్లు ఉంటుందని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారికి సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే, చిన్నారి శవంగా మారి పడి ఉండడం చూసి పలువురు హత్య అనే అభిప్రాయానాకి వస్తున్నారు. నాలుగేళ్ల వయసు ఉన్న చిన్నతనంలో ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉండదు కాబట్టి.. ఎవరైనా హత్య చేసి అక్కడ వదిలి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాక, చిన్నారి ఆడుకొనేందుకు రోడ్డుపైకి వచ్చి ప్రమాదవశాత్తు మరణించిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఒంటిపై గాయాలు తదితర ఇతర వివరాలను పరిశీలించాక పోలీసులు తుది నిర్ణయానికి రానున్నారు. ఇందుకోసం పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లారు. వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులు శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పసికందు ఉంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును పోలీసు స్టేషన్ ప్రహరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ దయనీయ ఘటన జరిగింది. శిశువును సంచిలో పడుకోబెట్టి రెండు వైపులా రాళ్ళు ఉంచి వ్యక్తులు వెళ్లిపోయారు.
Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?
తెల్లవారు జామున స్థానికులు శిశువు ఏడుపు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పసికందును వదిలి వెళ్ళడంపై పోలీసులు, స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్
Also Read: మూడు లారీలు.. ఐదు కోట్లు.. లైఫ్ సెటిలైనట్లేననుకున్నారు ఆ కానిస్టేబుళ్లు ! కానీ ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)