News
News
X

Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్‌ పతనానికి కారణాలివే..!

స్టాక్‌మార్కెట్లు సోమవారం ఏడు నెలల తర్వాత అతిపెద్ద పతనం చవిచూశాయి. ఒక్కరోజులోనే మదుపర్ల సంపద రూ.8 లక్షల కోట్లు ఆవిరైంది. కారణాలు ఇవేనని తెలుస్తోంది.

FOLLOW US: 

భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఏప్రిల్‌ తర్వాత దలాల్‌ బజార్లో ఇదే అతిఘోరమైన పతనం! సోమవారం ఒక్కరోజే మదుపర్ల సంపద రూ.7.86 లక్షల కోట్లు ఆవిరైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సహా అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం పీఎస్‌యూ స్టాక్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక ఓ2సీ వ్యాపారానికి సంబంధించిన ఒప్పందంలో అరామ్‌కో భాగస్వామ్యాన్ని పునరాలోచిస్తామని చెప్పడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు పడిపోయాయి. పేటీఎం షేరు ధర పడిపోవడం, ద్రవ్యోల్బణం పరమైన సమాచారం మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ను పెంచింది.

లాక్‌డౌన్లు
విదేశాల్లో తిరిగి కొవిడ్‌-19 లాక్‌డౌన్లు పెడుతున్నారు. త్వరలోనే తాము లాక్‌డౌన్‌ విధిస్తామని ఆస్ట్రియా తెలిపింది. ఫిబ్రవరి నుంచి వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేస్తామని ప్రకటించింది. జర్మనీ, స్లొవేకియా, చెక్‌ రిపబ్లిక్‌, బెల్జియం సైతం కొవిడ్‌ ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా కొన్ని కంపెనీల ఎగుమతులపై ప్రభావం పడనుంది.

వడ్డీరేట్ల భయం
ఊహించిన దానికన్నా ముందే వడ్డీరేట్ల పెంపు అందరినీ భయపెడుతోంది. ఐరోపా సెంట్రల్‌ బ్యాంకు రేట్ల పెంపు గురించి ఆలోచిస్తున్నట్టు బుందెస్‌బ్యాంక్‌ అధ్యక్షుడు జెన్స్‌ వీడ్‌మన్‌ తెలిపారు. కొన్నిరోజులు పాటు ద్రవ్యోల్బణం రెండు శాతానికి పైగానే ఉంటుందని వెల్లడించారు.

క్రూడ్‌ కష్టాలు
ముడి చమురు నష్టాలు మరో కారణం. ధరలు పెరగకుండా అడ్డుకొనేందుకు అమెరికా వంటిదేశాలు రిజర్వులను ఉపయోగిస్తున్నాయి. ఇదీ ద్రవ్యోల్బణానికి ఓ కారణం అవుతోంది.

దిద్దుబాటు దశ
ప్రస్తుతం మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ పోర్టుఫోలియో నిర్మించుకొనేందుకు ప్రస్తుత కన్సాలిడేషన్‌ ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. ఎక్కువ విలువ పెరిగిన స్టాకుల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమూ నష్టాలకు ఓ కారణమే.

Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే..!

Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్‌ ఇది!

Also Read: SBI ATM Cash Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! మోసగాళ్ల నుంచి రక్షణగా కొత్త రూల్‌

Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్‌ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్‌ సూపర్‌ హిట్టవుతుందా?

Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 05:57 PM (IST) Tags: Stock market stock share market share biggest crash Dalaal street

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్‌! క్రిప్టోలన్నీ నేల చూపులే!

Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్‌! క్రిప్టోలన్నీ నేల చూపులే!

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

టాప్‌ గెయినర్స్‌ August 17, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

టాప్‌ గెయినర్స్‌ August 17, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు