అప్రియమైన సీఎం జగన్- ట్విటర్ వేదికగా లోకేష్ పంచ్‌లు- 24 గంటల డెడ్‌లైన్
మీలాంటి వాళ్లమే మేము అనున్నారు... అవినీతి జరిగి ఉంటుందని సోదాలు చేశారు. చాలా అంశాలపై ఆరోపణలు చేశారు. కానీ మా ఆఫీసుల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదన్న నిజం మీరు తెలుసుకున్నారని లోకేష్ ట్వీట్ చేశారు.
గత పాలకులు స్కిల్‌డెవలప్‌మెంట్ నిధులు దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఘాటుగా స్పందించారు. మూడేళ్ల 8 నెలలుగా అధికారంలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... తనపై చేసిన ఆరోపణల్లో నిరూపించింది ఏంటని ప్రశ్నించారు. స్కిల్ డెవల్‌పమెంట్ సహా ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఆధారాలు వెల్లడించాలని సీఎం జగన్‌కు సవాల్ చేశారు.
సమస్య వచ్చిన ప్రతిసారీ ఏదో విషయంపై తనతోపాటు చంద్రబాబు, ఇతర టీడీపీ లీడర్లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా నారా లోకేష్ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. అప్రియమైన(Not So Dear) సీఎం జగన్‌తోపాటు వాళ్ల నాయకులకు నేను చెప్పేది ఏంటంటే? మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్ల ఎనిమిది నెలలు అవుతోంది. నేను లేదా మా పార్టీ అధ్యక్షుడు అవినీతికి పాల్పడ్డారో లేదో తెలుసుకోవడానికి మీరు చాలా ప్రయత్నించారు. చాలా లోతైన విచారణ చేశారు. ఇప్పటి వరకు మీరు చేసిందేమీ లేదు.
Not so Dear @ysjagan & Cronies, I wish to bring to your kind attention that it's already been 3 years 8 months since you have occupied office. You tried your hardest and dug deepest to find out if me or our party President have indulged in corruption.(1/5)#APSDCChallenge
— Lokesh Nara (@naralokesh) December 6, 2022
మీలాంటి వాళ్లమే మేము అనున్నారు... అవినీతి జరిగి ఉంటుందని సోదాలు చేశారు. చాలా అంశాలపై ఆరోపణలు చేశారు. కానీ మా ఆఫీసుల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదన్న నిజం మీరు తెలుసుకున్నారు. ఇది మీలాంటి అవినీతిపరులకు షాక్‌గా అనిపించింది. దాన్ని అంగీకరించేందుకు మీ మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్, ఐటీ కోస్‌కు ఇన్సెంటివ్‌లు ఇలా చాలా వాటిలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారు. మాపై అనేక ఆరోపణలు చేశారు. ఎన్ని ఎంక్వయిరీలు వేసినా అవన్నీ తుస్‌మన్నాయి. చివరకు చంద్రబాబుపై వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా చివాట్లు పెట్టి మరీ కోర్టు కొట్టేసింది.
Prove you are a man enough to fight me out in the open rather than make these fake, baseless allegations in order to tarnish my reputation.(5/5)#APSDCChallenge#24hrChallengeToJagan
— Lokesh Nara (@naralokesh) December 6, 2022
అదే నిరాశతో ఇప్పుడు APSDCపై పడ్డారు. దీంతో మరోసారి మళ్లీ నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను 24 గంటల్లో బయటపెట్టాలి మీకు సవాల్ చేస్తున్నాను. అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు లోకేష్.