Vijayawada News: జాతీయ రహదారిపై కార్ల రేసింగ్ - ముక్కలైన స్కూటీలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు
Andhrapradesh News: విజయవాడలో కార్ల రేసింగ్ కలకలం రేపింది. జాతీయ రహదారిపై అర్ధరాత్రి కార్లతో దూసుకెళ్లగా, నలుగురు యువకులు గాల్లోకి ఎగిరిపడ్డారు.
Car Racing in Vijayawada: విజయవాడలో (Vijayawada) శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్ (Car Racing) కలకలం రేపింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించగా, రామవరప్పాడు (Ramavarappadu) వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఫార్చ్యూనర్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీలపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ ఆస్పత్రికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో స్కూటీలు రెండు ముక్కలు కాగా, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, ప్రమాదానికి కారణమైన యువతి, యువకుడు మరో కారులో పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు వెళ్తూ రేసింగ్ పెట్టుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం చేసిన కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్లుగా మద్యం తాగి ప్రమాదం చేశారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: World Cup Final: ప్రపంచ కప్ ఫీవర్ - విశాఖ, విజయవాడల్లో భారీ స్క్రీన్ల వద్ద యువత సందడి