AP Corona Updates: ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 1,166 మందికి పాజిటివ్, 5 మరణాలు
ఏపీలో కొత్తగా 1,166 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 మంది మరణించారు. రాష్ట్రంలో 32,413 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
AP Corona Updates: ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,495 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1,166 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్(Covid) బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,688కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 9,632 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,64,032 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 32,413 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల(Positive Cases) సంఖ్య 23,11,133కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,27,84,934 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 11/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 11, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,11,133 పాజిటివ్ కేసు లకు గాను
*22,64,032 మంది డిశ్చార్జ్ కాగా
*14,688 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,413#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/S4WIfV5a86
తెలంగాణలో కొత్తగా 733 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,487 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో కొత్తగా 733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,82,336కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ తాజా గణాంకాలు విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,106కి చేరింది. కరోనాతో నిన్న 2,850 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 185 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయి. 657 మంది మృతి చెందారు. 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 3.89%కి పడిపోయింది.
- యాక్టివ్ కేసులు: 6,97,802 (1.64%)
- డైలీ పాజిటివిటీ రేటు: 3.89%
- మొత్తం వ్యాక్సినేషన్: 1,71,79,51,432
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 48,18,867 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,79,51,432 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అలర్ట్‌గా ఉండాలి
దేశంలో ఇదివరకుతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని కేంద్ర పేర్కొంది. జనవరి 24న దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని ఇప్పుడు 4.44 శాతానికి చేరిందని తెలిపింది. భారత్‌లో కరోనా స్థితిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా వైరస్‌పై పూర్తి అవగాహన లేనందున అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తి కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 40కు పైగా జిల్లాల్లో ఇంకా వీక్లీ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోందని పేర్కొంది. ప్రస్తుతం 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని.. 5-10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 160గా ఉందని వెల్లడించింది.