Paris Olympics 2024: నేడు బరిలోకి మీరా బాయ్ చాను, విశ్వ క్రీడల్లో ఇవాళ్టీ భారత షెడ్యూల్ ఇదే
Olympic Games Paris 2024: నేడు పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్ అవినాష్ సాబ్లే, రెజ్లింగ్ లో వినేష్ బరిలో ఉన్నారు.
India at Olympics Day 12 schedule: టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకాన్ని గెలుచుకుని సత్తా చాటిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి(Mirabai Chanu) చాను నేడు బరిలోకి దిగనుంది. రాత్రి 11:00 గంటలకు ప్రారంభమయ్యే మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో మీరాబాయి చాను పోటీ పడనుంది. 2017 ప్రపంచ ఛాంపియన్ అయిన మీరాబాయి చాను క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 119 కేజీలతో టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించి రజతం గెలిచింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తర్వాత రజత పతకం గెలిచిన రెండో భారతీయ మహిళగా చాను రికార్డు సృష్టించింది. మరోసారి పతకం కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది.
అథ్లెటిక్స్‌లో బరిలోకి...
అవినాష్ సాబ్లే(Avinash Sable) పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో పోటీపడతాడు. సోమవారం జరిగిన హీట్‌లో సాబ్లే 8:15.43 టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ చేరాడు. పారిస్ డైమండ్ లీగ్‌లో 8:09.94 టైమింగ్‌తో సాబ్లే జాతీయ రికార్డు సృష్టించాడు. మరోసారి అదే ప్రదర్శన కొనసాగించి సత్తా చాటాలని సాబ్లే చూస్తున్నాడు. మిక్స్‌డ్ మారథాన్ రేస్ వాక్ రిలేలో సూరజ్ పన్వర్, ప్రియాంక గోస్వామితో పాటు ఇతర భారత అథ్లెట్లు కూడా నేడు బరిలో దిగుతున్నారు. పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్‌లో సర్వేష్ కుషారే పాల్గొంటుండగా, పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ రౌండ్‌లలో ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్ పోటీపడతారు. జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అన్నూ రాణి జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌లో బరిలో దిగనున్నారు.
మనికబాత్రా బృందం...
భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్ ఫైనల్లో జర్మనీతో తలపడనుంది. 16వ రౌండ్‌లో బాత్రా బృందం 3-2తో రొమేనియాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన యాంటిమ్ పంఘల్... తుర్కియేకు చెందిన జైనెప్ యెట్‌గిల్‌తో పోటీ పడనుంది.
ఇవాళ్టీ భారత షెడ్యూల్
గోల్ఫ్
మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే తొలి రౌండ్ (అదితి, దీక్ష)- మధ్యాహ్నం 12.30;
టేబుల్ టెన్నిస్
మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ × జర్మనీ)- మధ్యాహ్నం 1.30
అథ్లెటిక్స్
అథ్లెటిక్స్: మిక్స్‌డ్ మారథాన్ నడక రిలే (ప్రియాంక, సూరజ్)- ఉదయం 11,
పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ (సర్వేశ్)- మధ్యాహ్నం 1.35,
మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (అన్ను రాణి)- మధ్యాహ్నం 1.55
మహిళల 100మీ.హార్డిల్స్ తొలి రౌండ్ నాలుగో హీట్ (జ్యోతి యర్రాజి)- 2.09PM
పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ (ప్రవీణ్, అబూబాకర్)- రాత్రి 10.45
పురుషుల 3000మీ.స్టీపుల్‌ఛేజ్ ఫైనల్ (అవినాశ్ సాబ్లె)- రాత్రి 1.13;
రెజ్లింగ్
మహిళల 53 కేజీల ప్రిక్వార్టర్స్ (అంతిమ్ × యెట్గిల్)- మధ్యాహ్నం 3.05
మహిళల ఫ్రీస్టైల్ 50 కిలోల ఫైనల్ - వినేష్ ఫోగాట్ vs సారా ఆన్ హిల్డెబ్రాండ్: అర్ధరాత్రి 12.30 తర్వాత
వెయిట్‌లిఫ్టింగ్
మహిళల 49 కేజీలు (మీరాబాయి చాను)- రాత్రి 1:13( అర్ధరాత్రి దాటిన తర్వాత)