అన్వేషించండి

Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు

Adilabad latest News:ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం బస్తాలకు చక్రాలు అమరుస్తున్నారు అక్రమార్కులు. ఓవైపు పోలీసులకు క్వింటాళ్లు చిక్కుతున్నా వారి దందాకు మాత్రం అడ్డుకట్ట పడకపోవడం ఆశ్చర్యకలిగిస్తోంది.

Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగా పక్కన ఉన్న మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. నెలలు తరబడి పదుల సంఖ్యలో అక్రమ బియ్యం తరలిస్తున్న వాహనాలు చిక్కుతున్నాయి. అయినా అధికారులు చూస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పోలీసులకు మాత్రమే ఈ రేషన్ బియ్యం పట్టుబడటం ఆలోచనలకు గురిచేస్తోంది. 

సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అక్రమ రేషన్ బియ్యం రవాణా సాగుతోందని చర్చించుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా బోరజ్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. 

Also Read: అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ గైర్హాజరుపై ప్రభుత్వం రియాక్షన్ ఇదే !

బోరజ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా జైనాథ్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి మాటువేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలఘట్‌కు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్ తాహిర్ తో పాటు లారీ యజమాని ఎం.డీ నజీం, బియ్యం సరఫరా చేస్తున్న నాగనాథ్, షఫీపై కేసు నమోదు చేశారు. 


Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు

విషయం తెలుసుకున్న అదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అక్కడకు చేరుకొని పట్టుకున్న బియ్యం లారీని పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ ఉప తహసీల్దార్ రాఠోడ్ రవీందర్ అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించారు. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: పెళ్లయిన నెల రోజులకే నవ వధవు ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోను రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. సరిహద్దు ప్రాంతం మీదుగా మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ రేటుకు కొని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు.  ఆ పీడీఎస్ బియ్యాన్ని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్నారు. కెరమెరి మండలంలోని వివిధ గ్రామాల  నుంచి సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. అనార్‌పల్లి వద్ద బానోత్ విజయ్ కుమార్ బొలెరో వాహనంతో తీసుకెళ్తున్న 8 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.  


Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు

నిర్మల్ జిల్లాలోనూ ఇటీవలే భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. వెంటనే సంబంధిత డీటీ, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 30 టన్నులపైనే పీడీఎస్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ బియ్యాన్ని పక్కనున్న మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నెల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పోలీసులకు పట్టుబడడం ముమ్మాటికి ఇది అధికారుల నిర్లక్ష్యమేనని సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget