(Source: ECI/ABP News/ABP Majha)
David Warner : ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్!, డేవిడ్ వార్నర్‌కు గాయం
IPL 2024: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడన్న వార్త ఢిల్లీ క్యాపిటల్స్ ఆందోళనకు గురిచేస్తోంది.
David Warner injured: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ డేవిడ్ వార్నర్(David Warner) గాయపడ్డాడన్న వార్త ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఆందోళనకు గురిచేస్తోంది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మిగిలిన పర్యటనకు దూరం అయ్యాడు. వార్నర్ తుంటి గాయంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు రెండో టీ20 మ్యాచ్‌కు దూరంగా ఉండగా తాజాగా సిరీస్ మొత్తానికే దూరం అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. డేవిడ్ వార్నర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని, అందుకు ఏడు నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఐపీఎల్ సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడనే ధీమాను వ్యక్తం చేసింది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు వార్నర్ కచ్చితంగా అంటుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చింది. ఐపీఎల్‌లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఏడాది రిషబ్ పంత్ గైర్హజరీలో జట్టుకు నాయకత్వం వహించాడు.
మార్చి 22 నుంచి ఐపీఎల్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
మార్చి 22: చెన్నై సూపర్ కింగ్స్ X రాయల్ ఛాలెంజర్స్‌బెంగళూరు (చెన్నై)
మార్చి 23: పంజాబ్ కింగ్స్ (PBKS) X దిల్లీ క్యాపిటల్స్ (DC) (మొహాలీ)
మార్చి 23: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) X సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) (కోల్‌కతా)
మార్చి 24: రాజస్థాన్ రాయల్స్ (RR) X లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) (జైపుర్)
మార్చి 24: గుజరాత్ టైటాన్స్ (GT) X ముంబయి ఇండియన్స్ (MI) (అహ్మదాబాద్)
మార్చి 25: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X పంజాబ్ కింగ్స్ (బెంగళూరు)
మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ (చెన్నై)
మార్చి 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబయి ఇండియన్స్ (హైదరాబాద్)
మార్చి 28: రాజస్థాన్ రాయల్స్ X దిల్లీ క్యాపిటల్స్ (జైపుర్)
మార్చి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X కోల్‌కతా నైట్‌రైడర్స్ (బెంగళూరు)
మార్చి 30: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X పంజాబ్ కింగ్స్ (లఖ్‌నవూ)
మార్చి 31: గుజరాత్ టైటాన్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
మార్చి 31: దిల్లీ క్యాపిటల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (వైజాగ్)
ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్ రాయల్స్ (ముంబయి)
ఏప్రిల్ 02: రాయల్ ఛాలెంజర్స్ X లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 03: దిల్లీ క్యాపిటల్స్ X కోల్‌కతా నైట్ రైడర్స్ (వైజాగ్)
ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్ X పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)
ఏప్రిల్ 05: హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 6: రాజస్థాన్ రాయల్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపుర్)
ఏప్రిల్ 7: ముంబయి ఇండియన్స్ X దిల్లీ క్యాపిటల్స్ (ముంబయి)
ఏప్రిల్ 7: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ (లఖ్‌నవూ)