అన్వేషించండి

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై నిషేధం? - ఆసియా క్రీడల్లో షాక్ తప్పదా!

భారత మహిళల క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ రెండ్రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Harmanpreet Kaur: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండ్రోజుల క్రితం ఆ జట్టుతో ముగిసిన మూడో వన్డే మ్యాచ్‌లో తన దురుసు ప్రవర్తనతో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కష్టాలు తప్పేలా లేవు. అంపైరింగ్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టడం.. అంపైర్‌ను వాగ్వాదానికి దిగడమే గాక సంజ్ఞల ద్వారా ఆయనను దూషించడం.. మ్యాచ్ ముగిశాక ప్రజెంటేషన్ సెర్మనీలో  అంపైర్లపై చేసిన వ్యాఖ్యలు, ట్రోఫీ అందుకునేప్పుడు బంగ్లా ఆటగాళ్లపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. దీనిపై ఇప్పటికే ఐసీసీ.. కౌర్‌ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె   నిషేధం కూడా ఎదుర్కోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

డీ మెరిట్ పాయింట్స్‌తోనే అసలు సమస్య.. 

హర్మన్‌ప్రీత్ తీరుకు  గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  ఆమె మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు 4 డీమెరిట్ పాయింట్స్ కూడా ఇచ్చింది.  ఐసీసీ నిబంధనల  ప్రకారం.. నాలుగు డీమెరిట్  పాయింట్స్ అంటే  రెండు  సస్పెన్షన్ పాయింట్స్.  అంటే దీనర్థం.. ఒక టెస్టు లేదా  రెండు టీ20లు గానీ రెండు వన్డేలలో గానీ నిషేధం ఉంటుంది. దీని ప్రకారం.. హర్మన్‌ప్రీత్ తర్వాత ఆడబోయే  రెండు మ్యాచ్‌లు (వైట్ బాల్ క్రికెట్‌లో అయితే) నిషేధం ఎదుర్కోక తప్పదు.  భారత జట్టు తర్వాత షెడ్యూల్ సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే  ఆసియా క్రీడలే.. 

బ్యాన్ ఉంటుందా..? 

పైన పేర్కొన్న నిబంధనల మేరకు హర్మన్‌ప్రీత్‌కు నిషేధం ఎదురైతే ఆమె ఆసియా క్రీడల్లో భారత్ ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లలో దూరమవుతుందా..? దీనికి సమాధానం  కాదనే చెప్పాలి.  ఎందుకంటే  ఆసియా క్రీడల్లో ఆడే మ్యాచ్‌లు ఐసీసీ పరిధిలోకి రావు. ఇది హర్మన్‌ప్రీత్‌కు లాభించేదే.   కానీ ఆసియా క్రీడల తర్వాత ఆమె ఆడబోయే భారత జట్టు  మ్యాచ్‌లలో  టీమిండియా సారథిపై నిషేధం తప్పకపోవచ్చు. అయితే ఇందులో  ఐసీసీ ఇంకా అధికారికంగా  ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

 

ఇండియన్ క్రికెట్ పరువు పోయింది.. 

హర్మన్‌ప్రీత్ తీరుపై భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ మదన్ లాల్  స్పందించాడు. ఆమె భారత క్రికెట్‌కు మచ్చ తెచ్చిందని, ఆట కంటే ఆమె గొప్పదేం కాదని  ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుపై హర్మన్‌ప్రీత్ వ్యవహరించిన తీరు  చాలా విషాధకరం. ఆమె ఆట కంటే  గొప్ప వ్యక్తేం కాదు. భారత క్రికెట్ పరువు తీసే విధంగా ఆమె వ్యవహరించింది. ఈ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవాలి’ అని  ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Embed widget