అన్వేషించండి

Virat Kohli: కింగ్‌ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు

Virat Kohli: భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్‌ లుక్‌ బిజెనెస్‌ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో అందులో కోహ్లీకి స్థానం దక్కింది.

Virat Kohli News: భారత్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో ఆ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నవ చరిత్ర లిఖించాడు. సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్‌ కింగ్‌ కోహ్లీ... ఆ క్రికెట్‌ దేవుడి రికార్డును సగర్వంగా దాటేశాడు. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో సచిన్‌ రికార్డును అధిగమించేశాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను తన పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ... 50 సెంచరీలతో దానిని అధిగమించాడు. తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత మరొకటి చేరింది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ రన్‌ మెషిన్‌ ఇప్పుడు మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంలో ఇమడ్చుకున్నాడు. 


 డిసెంబర్‌ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో విరాట్‌ కోహ్లీకి చోటు దక్కింది. భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్‌ లుక్‌ బిజెనెస్‌ ఈ జాబితా రూపొందించగా అందులో కోహ్లీకి స్థానం దక్కింది. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయవేత్త రాహుల్‌ గాంధీ, షారుక్‌ ఖాన్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళీ, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాలకు ఈ జాబితాలో చోటు దక్కింది.  పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌ 2023 పూర్తయినప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతను పాల్గొనలేదు. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలోనూ విరాట్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ సిరీస్‌ చివరన జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో విరాట్‌ రీఎంట్రీ ఇస్తాడు. 


 2023 ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాతే అవుట్ అయ్యాడు. 29వ ఓవర్ మూడో బంతికి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 10.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ముందుకు నడిపించారు.ఈ హాఫ్ సెంచరీతో టోర్నీలో కోహ్లీ 750 పరుగుల మార్కును దాటాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో 750+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. హాఫ్ సెంచరీతో 48 ఏళ్ల ప్రపంచకప్‌లో సెమీఫైనల్, ఫైనల్లో 50+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించాడు. కివీస్ జట్టుపై 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget